Rs 30 lakh
-
కొత్త హోం లోన్ ఆఫర్: కొన్ని ఈఎంఐలు రద్దు
ముంబై: ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ కొత్త గృహ రుణ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. గృహ ఋణ మార్కెట్లో ఎక్కువ మార్కెట్ వాటాను సంపాదించడానికి గుడ్ క్రెడిట్ అవార్డ్ కోసం ‘శుభ్ ఆరంభ్‘ పేరిట ఈ గృహ రుణ పథకాన్ని లాంచ్ చేసింది. ఇందులో కస్టమర్లకు మరో బంపర్ ఆఫర్ కూడా ఉంది. రూ. 30లక్షల రుణంపై దాదాపు మూడులక్షల దాకా తగ్గింపును ఆఫర్ చేస్తోంది. అంటే 20 ఏళ్ల కాలానికి సంబంధించిన రుణాలపై ఈఎంఐలను రద్దు చేస్తోంది. అయితే ఫ్లోటింగ్ రుణ పథకం కింద వడ్డీ రేటుమాత్రం స్థిరంగా 8.35 శాతంగానే కొనసాగుతుందని పేర్కొంది. దీంతోపాటు అర్హులైన వారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ప్రభుత్వం అందిస్తున్న మినహాయింపును కూడా పొందవచ్చని బ్యాంక్ ఒక ప్రకనటలో తెలిపింది. యాక్సిస్ బ్యాంక్ ట్విట్టర్ లో అందించిన సమాచారం ప్రకారం ఈ కొత్త రుణ చెల్లింపు వ్యవధిలో కొన్ని నెలవారీ వాయిదా చెల్లింపులకు (ఈఎంఐ) మినహాయింపు లభించేలా ఈ పథకాన్ని రూపొందించింది. 4, 8, 12 వ సం.రం చివరలో సంవత్సరానికి 4 నెలసరి వాయిదాలు చొప్పున రద్దు చేస్తుంది. ఇలా 20 ఏళ్ల వ్యవధికి రుణం తీసుకున్నవారికి మొత్తం మీద 12 ఈఎంఐల మేర ప్రయోజనం కస్టమర్లకు లభించనుంది. అంటే ఈ కొత్త పథకం ద్వారా సుమారు రూ. 30 లక్షల రుణంపై మొత్తం మీద రూ. 3.09 లక్షల మేర ఆదా అవుతుందని బ్యాంక్ తెలిపింది. అలాగే రూ. 30 లక్షల దాకా గృహ రుణాలకు ఈ పథకం వర్తిస్తుందని, రుణ చెల్లింపు వ్యవధి తగ్గింపు రూపంలో ఈ ప్రయోజనం అందిస్తామని వివరించింది. అంతేకాదు ఏ ఒక్క ఈఎంఐని చెల్లించకపోయినా.. వారికి ఈ పథకం ప్రయోజనాలు లభించవని బ్యాంక్ స్పష్టం చేసింది. You're closer to owning a home with the launch of Shubh Aarambh Home Loans. It's the helping hand you need, w/ 4 EMIs waived* every 4 years pic.twitter.com/kibU6QzOqF — Axis Bank (@AxisBank) August 17, 2017 -
యాక్సిస్ బ్యాంక్ ‘శుభ్ ఆరంభ్’
♦ అందుబాటులోకి కొత్త గృహ రుణ పథకం ♦ కొన్ని ఈఎంఐల మాఫీ ప్రయోజనం ముంబై: ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ కొత్తగా ‘శుభ్ ఆరంభ్‘ పేరిట మరో గృహ రుణ పథకాన్ని ప్రవేశపెట్టింది. రుణ చెల్లింపు వ్యవధిలో కొన్ని నెలవారీ వాయిదా చెల్లింపులకు (ఈఎంఐ) మినహాయింపు లభించేలా ఈ పథకాన్ని తీర్చిదిద్దారు. నాలుగు, ఎనిమిది, పన్నెండు సంవత్సరాల చివర్లో నాలుగు ఈఎంఐలను బ్యాంక్ మాఫీ చేస్తుంది. ఇలా 20 ఏళ్ల వ్యవధికి రుణం తీసుకున్నవారికి మొత్తం మీద 12 ఈఎంఐల మేర మాఫీ లభిస్తుంది. సుమారు రూ. 30 లక్షల రుణంపై మొత్తం మీద రూ. 3.09 లక్షల మేర ఆదా అవుతుందని బ్యాంక్ తెలిపింది. రూ. 30 లక్షల దాకా గృహ రుణాలకు ఈ పథకం వర్తిస్తుందని, రుణ చెల్లింపు వ్యవధి తగ్గింపు రూపంలో ఈ ప్రయోజనం అందిస్తామని వివరించింది. ఆసాంతం వడ్డీ రేటు స్థిరంగా 8.35 శాతంగానే కొనసాగుతుందని పేర్కొంది. ఒకవేళ ఏ ఒక్క ఈఎంఐని చెల్లించకపోయినా.. వారికి ఈ పథకం ప్రయోజనాలు లభించవు. -
కలిసుందామని రమ్మంటే.. రూ 30 లక్షలు కాజేశాడు
అహ్మదాబాద్: తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తి 30 లక్షల రూపాయలు కాజేశాడని గుజరాత్‌కు చెందిన ఓ మహిళా టీచర్ (42) పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు ఆశీష్ మోదీ ఫోర్జరీ సంతకాలతో తన బ్యాంక్ ఎకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేశాడని బాధితురాలు నవరంగ్పురకు చెందిన ఆర్తి సాంధారియా ఆరోపించింది. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఆర్తీ ఓ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. ఆరేళ్లక్రితం కార్ డీలర్షిప్ వద్ద ఆమెకు సరేంద్రనగర్కు చెందిన ఆశీష్ పరిచయమయ్యాడు. ఆ తర్వాత వీరిద్దరూ తరచూ కలిసేవారు. 12 ఏళ్ల క్రితం భార్య నుంచి విడిపోయినట్టు ఆశీష్ చెప్పగా, తాను కూడా భర్తకు దూరమైనట్టు ఆర్తీ చెప్పింది. సహజీవనం చేసేందుకు ఆర్తీ ఆహ్వానించగా, ఆశీష్ అంగీకరించాడు. వీరి బంధం కొన్నేళ్లు సవ్యంగా సాగింది. కాగా గత ఏప్రిల్‌లో ఆశీష్ తనకు తెలియకుండా డబ్బులు డ్రా చేసినట్టు ఆర్తీ గుర్తించింది. ఏటీఎమ్ కార్డుల నుంచి డబ్బు కాజేయడంతో పాటు ఎస్బీఐ, ఐసీఐసీఐ, యాక్సిక్ బ్యాంక్ ఎకౌంట్ల నుంచి 10 లక్షలు డ్రా చేసినట్టు తెలుసుకుంది. ఇక క్రెడిట్ కార్డు ఉపయోగించి మరో 8 లక్షలు వాడుకున్నట్టు గుర్తించింది. ఈ విషయంపై ఆశీష్‌ను నిలదీయగా, డబ్బులు తిరిగి చెల్లిస్తానని చెప్పాడు. ఆ తర్వాత ఆర్తీకి దూరంకావడంతో పాటు ఫోన్ చేసినా మాట్లాడేవాడు కాదు. నాలుగేళ్ల క్రితం వ్యాపారనిమిత్తం 9 లక్షల రూపాయలు, ఏడాది క్రితం మరో నాలుగు లక్షల రూపాయలు ఆశీష్కు అప్పుగా ఇచ్చినట్టు ఆర్తీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.