Rs. 6
-
రూ. 6,380 కోట్ల మేర టోపీ
-
రూ. 6,380 కోట్ల మేర టోపీ
ఏపీలో అగ్రిగోల్డ్ బాధితులు 19.52 లక్షలు: సీఐడీ నివేదన సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ యాజమాన్యం దేశవ్యాప్తంగా 32.02 లక్షల మంది డిపాజిటర్లను రూ. 6380.48 కోట్ల మేర మోసం చేసిందని ఏపీ సీఐడీ అధికారులు సోమవారం ఉమ్మడి హైకోర్టుకు నివేదించారు. ఆంధ్రప్రదేశ్‌లో 19.52 లక్షల మందిని రూ. 3,966 కోట్ల మేర మోసం చేసిందని తెలిపారు. ఇటీవల ఐదు దశల్లో ఆస్తులను జప్తు చేశామని, వాటి మార్కెట్ విలువ రూ. 2,500 కోట్లు ఉంటుందని వివరించారు. దర్యాప్తులో భాగంగా అగ్రిగోల్డ్ యాజమాన్యానికి చెందిన హార్డ్‌డిస్క్, సీడీలను స్వాధీనం చేసుకున్నామని, విస్మయకర విషయాలు తెలిశాయన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురిని అరెస్ట్ చేశామని, ఇందులో ఐదుగురు డైరెక్టర్లు ఉన్నారని తెలిపారు. ఈ వ్యాజ్యాలను న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్ల ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. -
ఇంటెక్స్ మరో కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది
ప్రముఖ మొబైల్ కంపెనీ ఇంటెక్స్ ఓ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది ఆక్వా సిరీస్ విజయవంతమైన నేపథ్యంలో ఆక్వా స్ట్రాంగ్ 5.2 పేరుతో మరో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో విడుదల చేసింది. దీని ధరను రూ. 6,390గా కంపెనీ నిర్ణయించింది. అయితే ఇతర చోట్ల లభ్యత వివరాలు స్పష్టం కానప్పటికీ ఇంటెక్స్ వెబ్ సైట్ లో ఇది లిస్ట్ అయింది. ఆక్వా సిరీస్ లోని ఆక్వా స్ట్రాంగ్ 5.1 కొనసాగింపుగా దీన్ని లాంచ్ చేసినట్టుగా మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వైట్, బ్లూ, షాంపైన్ కలర్ వేరియంట్ లో అందుబాటులో ఉన్న ఫోన్ లో ఉన్న సెల్పీ కెమెరా వెరీ స్పెషల్ అని కంపెనీ చెబుతోంది. పనోరమా మోడ్ లో, స్మైల్ డిటెక్షన్, ఫేస్ బ్యూటీతదితర ఫీచర్లు ఉన్నాయని పేర్కొంది. ఆక్వా స్ట్రాంగ్ 5.2 ఫీచర్లు 5 డిస్ ప్లే 1గిగా హెడ్జ్ ప్రాసెసర్ 480x854 పిక్సెల్ రిజల్యూషన్ 6.0 ఆండ్రాయిడ్ మార్ష్ మిల్లా , డ్యూయల్ సిమ్ , గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ) 2 జీబీ ర్యామ్ 16 జీబీ స్టోరేజ్ 32జీబీ ఎక్స్‌పాండబుల్ మెమొరీ 5ఎంపీ రియర్ కెమెరా 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా 2800ఎంఏహెచ్ బ్యాటరీ అయితే 1జీబీ ర్యామ్ తో 'ఆక్వా స్ట్రాంగ్ 5.1 ' రూ. 4,999 లకు ఈ ఏడాది ఆగస్టులో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. కేవలం రెండు నెలలోనే మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తేవడం విశేషం.