ఏపీలో అగ్రిగోల్డ్ బాధితులు 19.52 లక్షలు: సీఐడీ నివేదన
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ యాజమాన్యం దేశవ్యాప్తంగా 32.02 లక్షల మంది డిపాజిటర్లను రూ. 6380.48 కోట్ల మేర మోసం చేసిందని ఏపీ సీఐడీ అధికారులు సోమవారం ఉమ్మడి హైకోర్టుకు నివేదించారు. ఆంధ్రప్రదేశ్‌లో 19.52 లక్షల మందిని రూ. 3,966 కోట్ల మేర మోసం చేసిందని తెలిపారు. ఇటీవల ఐదు దశల్లో ఆస్తులను జప్తు చేశామని, వాటి మార్కెట్ విలువ రూ. 2,500 కోట్లు ఉంటుందని వివరించారు.
దర్యాప్తులో భాగంగా అగ్రిగోల్డ్ యాజమాన్యానికి చెందిన హార్డ్‌డిస్క్, సీడీలను స్వాధీనం చేసుకున్నామని, విస్మయకర విషయాలు తెలిశాయన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురిని అరెస్ట్ చేశామని, ఇందులో ఐదుగురు డైరెక్టర్లు ఉన్నారని తెలిపారు. ఈ వ్యాజ్యాలను న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌ల ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది.
రూ. 6,380 కోట్ల మేర టోపీ
Published Tue, Mar 28 2017 2:37 AM | Last Updated on Sat, Aug 11 2018 8:21 PM
Advertisement