'హుదూద్ నిలువునా ముంచేసింది'
విశాఖపట్నం: హుదూద్ తుపాన్ విధ్వంసంతో తమను నిలువునా ముంచేసిందని విశాఖపట్నం షిప్పింగ్ హార్బర్లోని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం షిప్పంగ్ హార్బర్లో సాక్షి విలేకరితో మత్స్యకారులు మాట్లాడుతూ... తుపాన్ బీభత్సానికి 60 మర బోట్లు దెబ్బతిన్నాయని చెప్పారు.
ఒక్కో మరబోటు విలువ రూ. 40 లక్షలు ఉంటుందని అన్నారు. దాదాపు రూ. 30 కోట్ల మేర నష్టపోయామని అన్నారు. ఈదురుగాలులు, అలల తాకిడికి మరబోట్లు హార్బర్లోని జెట్టీపైకి కొట్టుకువచ్చాయని తెలిపారు. తమను అదుకోవాలని మత్స్యకారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.