రోడ్లకు కావాలి రూ.866 కోట్లు
వర్షాల నష్టం అంచనా రూపొందించిన రోడ్లు భవనాల శాఖ
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 1,170 కి.మీ. మేర రోడ్లు దెబ్బతిన్నట్టు రోడ్లు భవనాల శాఖ గుర్తించింది. నష్టం దాదాపు రూ.866 కోట్లుగా తేల్చింది. ఈ మేరకు తుది నివేదికను సిద్ధం చేసి రాష్ట్రప్రభుత్వానికి పంపాలని నిర్ణయించింది.
దీనికి సంబంధించి రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రోడ్లు భవనాల శాఖ అధికారులతో బుధవారం చర్చించారు. వెంటనే నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించారు.