తొలిరోజే రూ. 20 కోట్లు వసూళ్లు
ముంబై: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తాజా చిత్రం 'సింగ్ ఈజ్ బ్లింగ్' తొలిరోజు భారీ వసూళ్లను సాధించింది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం తొలి రోజు 20.67 కోట్ల రూపాయలు రాబట్టింది. అక్షయ్ కుమార్ కెరీర్లో తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం ఇదే.
ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్షయ్, అమీ జాక్సన్, కే కే మీనన్, లారా దత్తా నటించారు. ఈ వారం భారీ చిత్రాలు లేకపోవడంతో సింగ్ ఈజ్ బ్లింగ్కు భారీ కలెక్షన్లు రావచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. రౌడీ రాథోడ్ తర్వాత ప్రభుదేవా, అక్షయ్ కుమార్ కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రమిది.