పట్టపగలు కోఠి బస్టాండ్‌లో భారీ దోపిడీ
హైదరాబాద్: పట్టపగలు జనం రద్దీగా ఉండే కోఠి బస్టాండ్‌లో భారీ దోపిడీ జరిగింది. కొందరు దుండగులు బైకుపై వెళుతున్న ఇద్దరిని బెదిరించి, వారి వద్ద ఉన్న 45 లక్షల రూపాయలను అపహరించుకుపోయారు. బాధితులు సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం ఒక డెయిరీ ఫామ్‌కు సంబంధించిన 45 లక్షల రూపాయలను ఇద్దరు వ్యక్తులు బైకుపై బేగంపేట కార్యాలయం నుంచి విజయా బ్యాంకులో జమచేయడానికి బయలుదేరారు. వారు కోఠి బస్టాండ్ వద్దకు వెళ్లిన తరువాత కొందరు వ్యక్తలు వారిపై దాడి చేశారు. కత్తులతో వారిని గాయపరిచి బెదిరించారు. ఆ సొమ్ము తీసుకొని పారిపోయారు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. తెలిసినవారే ఈ దాడికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.