రూ. కోటికి టోకరా
పరారీలో ఇద్దరు
చెరో రూ.50 లక్షల చొప్పున స్వాహా
బాధితుల ఆందోళన
భీమారం : ఫారెస్ట్ అధికారి రూ.5 కోట్లతో ఉడాయించిన ఉదం తం మరిచిపోకముందే.. గోపాలపురంలో మరో ఇద్దరు ఇదే వ్యవహారానికి పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. గోపాలపురానికి చెందిన ఓ వ్యక్తి తనకు హైదరాబాద్లో కంప్యూటర్ సెంటర్ ఉందని వివిధ వర్గాలను నమ్మించాడు. ఒక్కొక్కరి వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు సోమ్ము చేసుకున్నాడు. చివరికి అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి తేవడంతో చివరికి తాను ఉన్న ఇల్లు సైతం అమ్మకానికి పెట్టాడు. బయానా కూడా తీసుకున్నాడు. రిజిసే్ట్రన్ చేయించే క్రమంలోనే ఉడాయించాడు. అయితే రిజి సే్ట్రష¯ŒS చేసుకోవడానికి వచ్చిన వ్యక్తి నాలుగైదు రోజులపాటు అతడి కోసం ప్రయత్నించాడు.
ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో చేసేదేమిలేక లబోదిబోమంటున్నాడు. అప్పులు ఇచ్చిన వారు కూడా అతడి ఇంటికి వచ్చి వెళ్తున్నట్లు స్థానికులు తెలిపారు. అలాగే హసన్పర్తికి చెంది న మరో వ్యక్తి గోపాలపురంలో ఓ షాప్ నిర్వహణ కోసం సుమా రు రూ.50 లక్షలు అప్పు చేశాడు. కొందరి నుంచి పెద్దమొత్తంలో డబ్బు అప్పుగా తీసుకోగా, మరికొందరి నుంచి రోజు వారీ చిట్టీ రూపంలో డబ్బులు తీసుకున్నాడు. అయితే వ్యాపా రంలో నష్టం రావడంతో పరారయ్యాడు. రెండు రోజులుగా రోజువారీ చిట్టీలు నడిపించేవారు అతడి కోసం ప్రయత్నించినా ఆచూకీ లభిం చలేదు. అతడి ఇంటికి వెళితే కుటుంబ సభ్యుల నుంచి సరైన సమాధానం రావడం లేదని బాధితులు వాపోయారు.