మరోసారి కాల్పులకు తెగబడిన పాక్
జమ్మూ: పాక్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ జిల్లాలోని ఆర్ఎస్ పురా సెక్టర్లో బీఎస్ఎఫ్ జవాన్లే లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు జరుపుతుందని పోలీసు ఉన్నతాధికారులు ఆదివారం జమ్మూలో వెల్లడించారు. బీఎస్ఎఫ్ జవాన్లు వెంటనే అప్రమత్తమై పాక్ సైన్యంపైకి కాల్పులు జరుపుతున్నారని చెప్పారు.
అయితే గత అర్థరాత్రి నుంచి ఇరువైపులా కాల్పులు హోరాహోరిగా కొనసాగుతున్నాయని తెలిపారు. పాక్ కాల్పుల నేపథ్యంలో మన జవాన్లకు ఎటువంటి గాయాలు కాలేదని పోలీసు ఉన్నతాధికారి చెప్పారు.