RSS office
-
సీఎంపై వ్యాఖ్యలు.. ఆర్ఎస్ఎస్ ఆఫీసుపై బాంబు దాడి!
కొచ్చి: కేరళలోని కోజికోడ్ జిల్లాలో ఆర్ఎస్ఎస్ కార్యాలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడికి పాల్పడ్డారు. నాదపురం సమీపంలోని కళ్లాచీలో గురువారం రాత్రి జరిగిన ఈ బాంబు దాడిలో ముగ్గురు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గాయపడ్డారు. క్షతగాత్రులను కోజికోడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను ఎవరైనా చంపితే, వాళ్లకు కోటి రూపాయలు ఇస్తామని మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్ఎస్ఎస్ నాయకుడు డాక్టర్ చంద్రావత్ వ్యాఖ్యానించిన కొన్ని గంటల్లోనే ఈ దాడి జరగటం గమనార్హం. సీఎం విజయన్ తల కోసం అవసరమైతే తన ఆస్తి మొత్తం అమ్మేస్తానని కూడా ఉజ్జయినిలో ఆర్ఎస్ఎస్ ప్రముఖ్‌గా పనిచేస్తున్న చంద్రావత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. బాంబు దాడి కచ్చితంగా సీపీఎం కార్యకర్తల పనే అని ఆర్ఎస్ఎస్ ఆరోపిస్తోంది. కొంతకాలంగా తమ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు విమర్శించారు. ఇప్పటికే ఎంతోమంది తలల్ని తీశారు: సీఎం ఆ సీఎంను చంపితే.. కోటి ఇస్తా: ఆర్ఎస్ఎస్ నేత -
ఆరెస్సెస్ కార్యాలయంపై హిందూ శ్రేణుల దాడి!
ధార్: మధ్యప్రదేశ్ ధార్‌లోని త్రిమూర్తినగర్‌లో ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కార్యాలయంపై హిందూ కార్యకర్తలు శుక్రవారం దాడి చేశారు. కార్యాలయంపై రాళ్లు రువ్వి.. కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. బసంత పంచమీ సందర్భంగా ఇక్కడి భోజ్‌శాల కమల్ మౌలా మసీదు విషయమై వివాదం తలెత్తింది. ఈ ప్రాంగణంలో ఏకకాలంలో పూజలు చేసేందుకు హిందువులు, ప్రార్థనలు చేసేందుకు ముస్లింలు రావడంతో శుక్రవారం ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో భోజ్‌శాలలోకి ప్రవేశించవద్దని ఆరెస్సెస్ నాయకత్వంతోపాటు, ధర్మ జాగరణ్ మంచ్, భోజ్ ఉత్సవ సమితి హిందువులకు పిలుపునిచ్చింది. దీనిపై హిందూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఆరెస్సెస్ నాయకులు భోజ్‌శాలను అమ్మేశారంటూ మండిపడ్డారు. స్థానిక ఆరెస్సెస్ నాయకుడు విజయ్‌సింగ్ రాథోడ్ ఇంటి వద్ద భారీగా మూగి ఆందోళన చేసేందుకు వారు ప్రయత్నించారు. తన రాజకీయ భవిష్యత్తు కోసం విజయ్‌సింగ్ రాథోడ్ బీజేపీ ప్రభుత్వంతో కుమ్మక్కయి.. ఈ వ్యవహారంలో ఉద్యమాన్ని నీరుగార్చారని ఆరోపిస్తూ వారు నిరసన తెలియజేశారు. దీంతో పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో భోజ్‌శాలలోకి ప్రవేశించేందుకు హిందువులకు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్థానిక ఆరెస్సెస్ నాయకత్వం తీరుపై మండిపడుతూ హిందూ కార్యకర్తలు ఆ సంస్థ కార్యాలయంపై దాడి దిగారు.