రబ్రీదేవి చెప్పారనే.. ఆర్ఎస్ఎస్ ప్యాంట్లు!
ఆర్ఎస్ఎస్ కార్యకర్తల నుంచి నాయకుల వరకు ప్రతి ఒక్కరూ ఇంతకుముందు ఖాకీ నిక్కర్లు వేసుకుని పెరేడ్ చేసేవారు. తమ కార్యక్రమాలన్నింటికీ సర్సంఘ్ చాలక్ (జాతీయ అధ్యక్షుడు) సహా అందరూ తెల్ల చొక్కా, ఖాకీ నిక్కరు ధరించే వచ్చేవారు. కానీ దసరా నుంచి ఆ పద్ధతి మారింది. అందరూ ఖాకీ ప్యాంట్లు ధరిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు మారని పద్ధతి.. ఇప్పుడే మారిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై ఆర్జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్ యాదవ్ విభిన్నంగా స్పందించారు. తన భార్య రబ్రీదేవి చెప్పడం వల్లే ఆర్ఎస్ఎస్ వాళ్లు యూనిఫాం మార్చుకున్నారని లాలు అన్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్లు పట్టపగలు కూడా సిగ్గు పడకుండా నిక్కర్లు వేసుకుని రోడ్ల మీద తిరుగుతున్నారని రబ్రీదేవి చెప్పారని.. అందుకే ఇప్పుడు వాళ్లు ప్యాంట్లకు మారారని అన్నారు. దాంతోపాటు.. తాజాగా ఇదే అంశంపై మరో ట్వీట్ కూడా చేశారు.
తనదైన కవితాత్మక భాషలో ఆయన ఈ అంశం గురించి ఇలా చెప్పారు. ''ఇప్పడే మేం హాఫ్ ప్యాంట్లను ఫుల్ చేయించుకున్నాం.. మైండ్ కూడా ఫుల్ చేయించుకుంటాం... ప్యాంట్లే కాదు ఆలోచనలు కూడా మార్చుకుంటాం.. ఆయుధాలు పక్కన పెడతాం.. విషయం వ్యాపించనివ్వం'' అని ట్వీట్లో రాశారు.
अभी तो हमने हाफ को फुल पेंट करवाया है
माइंड को भी फुल करवायेंगे
पैंट ही नहीं सोच भी बदलवायेंगे
हथियार भी डलवायेंगे
जहर नही फ़ैलाने देंगे।। pic.twitter.com/LAIUV6dRYA
— Lalu Prasad Yadav (@laluprasadrjd) 11 October 2016