ఆర్టీఏ సిబ్బందిపై దూసుకెళ్లిన జబ్బార్ ట్రావెల్స్ బస్సు
అమీర్‌పేటలో ప్రవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులపై ఆర్టీఏ అధికారులు ఆదివారం తెల్లవారుజాము నుంచి తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు తనిఖీలు నిర్వహిస్తున్న ఆర్టీఏ అధికారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆర్టీఏకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు.
దాంతో ఆర్టీఏ అధికారులు స్థానికుల సహయంతో క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 11 బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. అలాగే చిత్తూరు జిల్లా పుంగనూరులో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 4 ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు.