RTC labor strike
-
కార్మిక న్యాయస్థానానికే బాధ్యతలు..!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు సూచనలు చేస్తూ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కార్మిక శాఖ చర్యలకు ఉపక్రమించింది. కార్మికుల డిమాండ్లు పరిశీలించి 2 వారాల్లో పరిష్కరించాలని, లేకుంటే కార్మిక న్యాయస్థానానికి నివేదిక ఇవ్వాలని కార్మిక శాఖ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. కార్మికుల డిమాండ్లు, సమస్యల పరిష్కారం కార్మిక శాఖ పరిధిలో పరిష్కారమవుతాయా? లేక కార్మిక న్యాయస్థానానికి బాధ్యతలు అప్పగించాలా అనేదానిపై ఆ శాఖ తర్జనభర్జన పడుతోంది. కార్మిక శాఖ పరిధిలో సమస్య పరిష్కారమవ్వని పక్షంలో కార్మిక న్యాయస్థానానికి బాధ్యతలు ఇవ్వాల్సి వస్తే.. అందుకుగల కార ణాలను స్పష్టం చేయాలి. దీంతో కార్మిక శాఖ కమిషనరేట్ యంత్రాంగం కార్మిక చట్టాలు, నిబంధనలు తదితరాలను పరిశీలిస్తోంది. తీర్పు ప్రతి రాగానే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కార్మిక శాఖ కమిషనరేట్ పరిధిలో సాధ్యమయ్యే అవకాశాలు లేవని ఆ శాఖ భావిస్తోంది. కార్మికుల డిమాండ్లన్నీ ఆర్టీసీ యాజమాన్యం పరిధిలోనివి. ఇందులో కొన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనివి. దీంతో వీటి పరిష్కారానికి కార్మిక శాఖ కంటే కార్మిక న్యాయస్థానమే సరైందని అధికారులు భావిస్తున్నారు. దీంతో సమస్య పరిష్కారం కోసం కార్మిక న్యాయస్థానాన్ని కోరేందుకు కార్మిక శాఖ కార్యాచరణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు తీర్పు ఇచ్చి 3 రోజులవుతున్నా.. కోర్టు నుంచి అధికారికంగా తీర్పు ప్రతి రాలేదు. క్రమపద్ధతిలో తీర్పు ప్రతి అందిన వెంటనే తదుపరి చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు ముందు నోటీసులు ఇచ్చిన క్రమంలో ఆర్టీసీ యాజమాన్యం, కార్మికుల మధ్య కార్మిక శాఖ సంప్రదింపులు మొదలుపెట్టింది. వాస్తవానికి ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నిర్ణీత గడువు ముగిసినప్పుడే కార్మికులు సమ్మె చేపట్టాలి. కానీ సంప్రదింపుల సమయంలోనే కార్మికులు సమ్మెకు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో కార్మికులు చేపట్టిన సమ్మె చట్ట విరుద్ధమా లేదా అనేది కార్మిక న్యాయస్థానం తేల్చాలి. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం 2 వారాల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిన క్రమంలో గడువులోగా కార్మిక న్యాయస్థానానికి పూర్తి వివరాలు, ఆధారాలతో నివేదికను సమర్పించేందుకు కార్మిక శాఖ చర్యలు వేగిరం చేసింది. హైకోర్టు తీర్పు ప్రతి అందిన గంటల వ్యవధిలోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కూడా కార్మిక శాఖ భావిస్తోంది. 6 నెలల్లో పరిష్కారం కష్టమే.. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కార అంశం కార్మిక న్యాయస్థానానికి అప్పగించేందుకు సిద్ధమవుతున్న కార్మిక శాఖ.. కార్మిక చట్టాల్లోని క్లాజ్‌ల ప్రకారం 6 నెలల వ్యవధి లో పరిష్కరించేలా సూచన చేయనుంది. వాస్తవానికి చట్టంలో పొందుపర్చిన విధంగా 6 నెలల్లో సమస్యను పరిష్కరించాల్సి ఉన్న ప్పటికీ.. ఆధారాల సమర్పణ, విచారణ అంశం అంత సులువైన ప్రక్రియ కాదని నిపుణులు చెబుతున్నారు. కార్మికుల వాదనలన్నీ కార్మిక న్యాయస్థానం ప్రత్యక్షంగా వినాల్సి ఉంటుంది. ప్రస్తుతం సమ్మెలో 48 వేలకుపైగా కార్మికులు పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ప్రతి ఒక్క కార్మికుడి వాదన వినాల్సి ఉండటంతో ఈ వ్యవధి చాలదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీంతో కేసు విచారణకు మరింత సమయం పట్టే అవకాశం లేకపోలేదు. -
ఎక్కడి బస్సులక్కడే
సాక్షి, కడప : ఆర్టీసీ కార్మికుల సమ్మెతో జిల్లాలోని ఎనిమిది డిపోల్లో తొలి రోజు బుధవారం బస్సులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీ కులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జిల్లా వ్యాప్తంగా 956 బస్సులు ఉండగా, అందులో 880కి పైగా బస్సులు డిపోల్లో నిలిచిపోయాయి. ఆర్టీసీ అధికారులు మిగిలిన అరకొర బస్సులను నడిపినా అవి ప్రయాణికులందరికి ఏ మాత్రం సరిపోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణీకులు దొరికిన వాహనాన్ని పట్టుకుని అతి కష్టంగా గమ్యస్థానాలు చేరుకున్నారు. మరికొందరు ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రైవేటు వాహన యాజమాన్యాలు దోపిడీకి తెర తీశాయి. చాలా రూట్లలో రెండింతలు చార్జీలు వసూలు చేశారని ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందుల ప్రాంతంలో మరీ ఎక్కువ చార్జీలు వసూలు చేశారు. కొన్ని వాహనాల్లో కడప నుంచి పులివెందులకు రూ.100 వసూలు చేశారు. మధ్యలో ఎక్కడ ఎక్కి ఎక్కడ దిగినా ఇదే చార్జీ దండుకున్నారు. రవాణా శాఖ అధికారులు, పోలీసులు చోద్యం చూడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న తమకు ప్రజలు సహకరించాలని ఆర్టీసీ కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చే వరకు ఆందోళన విరమించే ప్రసక్తి లేదని వారు తేల్చి చెబుతున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ గ్యారేజీలకే పరిమితమయ్యాయి. లక్షలాది మంది ప్రయాణీకులు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. సమ్మెలో 4558 మంది కార్మికులు జిల్లాలో ఆర్టీసీ ఎంప్లాయిస్, నేషనల్ మజ్దూర్తోపాటు మిగతా యూనియన్లకు సంబంధించి 4558 మంది కార్మికులు ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. దీంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు ఆగిపోయాయి. బుధవారం ఉదయం కార్మికులు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముందే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి కార్మికుల సమ్మెతో ఒక్క రోజే రూ.90 లక్షల నష్టం వాటిల్లింది. కాగా, కడప నుంచి హైదరాబాద్, చెన్నై, విజయవాడ, బెంగుళూరు తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకుల నుంచి ప్రైవేట్ ట్రావెల్ యాజమాన్యాలు చార్జీలు పెంచి వసూలు చేస్తున్నాయి. రైళ్లు కి క్కిరిశాయి. బోగీల్లో ప్రయాణికులు నిలుచుని ప్రయాణించారు. -
27 నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె
హన్మకొండ సిటీ, న్యూస్‌లైన్ : ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం, యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా యి.. అందుకే 27వ తేదీ నుంచి సమ్మెకు వెళ్తున్నామని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పీఆర్.రెడ్డి, రీజియ న్ అధ్యక్షుడు ఈఎస్ బాబు చెప్పారు. సమ్మెకు సన్నాహకంగా మంగళవారం ఎంప్లాయీస్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ల అధ్వర్యంలో ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపడంతోపాటు, హన్మకొండలోని వరంగల్-1, 2, హన్మకొండ డిపో గేట్లలో ధర్నా చేశారు. వరంగల్-1 డిపో వద్ద వారు మాట్లాడుతూ కార్మికు ల డిమాండ్లు పరిష్కరించాలని, లేదంటే జనవరి 6వ తేదీ తరువాత ఎప్పుడైనా సమ్మెకు వెళతామని ప్రభుత్వానికి, యాజమాన్యానికి, కార్మిక శాఖకు డిసెంబర్లోనే సమ్మె నోటీసు ఇచ్చినా స్పందించలేదని, దీంతో సమ్మెకు వెళ్లడం అనివార్యమైందని చెప్పారు. 2013 ఏప్రిల్ 1 నుంచి నూతన వేతన సవరణ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు చేయకుండా కార్మికులు జీవితాలతో ప్రభుత్వం చెలగాట మాడుతోందని మండిపడ్డారు. ఆర్టీసీలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని, కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, అక్రమ రవాణాను అరికట్టి కొత్త బస్సు లు కొనుగోలు చేయాలని, కారుణ్య నియామకాలు పూర్తి స్థాయిలో చేపట్టాలని, వేతన సవరణ జరిగే వరకు మధ్యంతర భృతి 46 శాతం చెల్లించాలని డిమాండ్ చేశారు. సమ్మెకు కార్మికులను సన్నద్ధం చేయడం లో భాగంగా ఈనెల 23న ఎంప్లాయీస్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ల ఆధ్వర్యంలో కరీంనగర్లో జోన్ స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఎం యూ రీజియన్ కార్యదర్శి డీఆర్.రెడ్డి, వర్కిం గ్ ప్రెసిడెంట్ ఎండీ.గౌస్, సహాయక కార్యద ర్శి ఆర్.సాంబయ్య, నాయకులు జితేందర్‌రెడ్డి, మల్లికార్జున్, యాదగిరి, కె.సి.పాణి, టీఆర్సింగ్, మూర్తి, ఆర్.వి.గోపాల్, అంజనేయులు, కేఎస్ నారాయణ, రవీందర్, పాషా తదితరులు పాల్గొన్నారు.