హన్మకొండ సిటీ, న్యూస్‌లైన్ : ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం, యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా యి.. అందుకే 27వ తేదీ నుంచి సమ్మెకు వెళ్తున్నామని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పీఆర్.రెడ్డి, రీజియ న్ అధ్యక్షుడు ఈఎస్ బాబు చెప్పారు.
సమ్మెకు సన్నాహకంగా మంగళవారం ఎంప్లాయీస్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ల అధ్వర్యంలో ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపడంతోపాటు, హన్మకొండలోని వరంగల్-1, 2, హన్మకొండ డిపో గేట్లలో ధర్నా చేశారు. వరంగల్-1 డిపో వద్ద వారు మాట్లాడుతూ కార్మికు ల డిమాండ్లు పరిష్కరించాలని, లేదంటే జనవరి 6వ తేదీ తరువాత ఎప్పుడైనా సమ్మెకు వెళతామని ప్రభుత్వానికి, యాజమాన్యానికి, కార్మిక శాఖకు డిసెంబర్‌లోనే సమ్మె నోటీసు ఇచ్చినా స్పందించలేదని, దీంతో సమ్మెకు వెళ్లడం అనివార్యమైందని చెప్పారు.
2013 ఏప్రిల్ 1 నుంచి నూతన వేతన సవరణ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు చేయకుండా కార్మికులు జీవితాలతో ప్రభుత్వం చెలగాట మాడుతోందని మండిపడ్డారు. ఆర్టీసీలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని, కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, అక్రమ రవాణాను అరికట్టి కొత్త బస్సు లు కొనుగోలు చేయాలని, కారుణ్య నియామకాలు పూర్తి స్థాయిలో చేపట్టాలని, వేతన సవరణ జరిగే వరకు మధ్యంతర భృతి 46 శాతం చెల్లించాలని డిమాండ్ చేశారు.
సమ్మెకు కార్మికులను సన్నద్ధం చేయడం లో భాగంగా ఈనెల 23న ఎంప్లాయీస్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ల ఆధ్వర్యంలో కరీంనగర్‌లో జోన్ స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఎం యూ రీజియన్ కార్యదర్శి డీఆర్.రెడ్డి, వర్కిం గ్ ప్రెసిడెంట్ ఎండీ.గౌస్, సహాయక కార్యద ర్శి ఆర్.సాంబయ్య, నాయకులు జితేందర్‌రెడ్డి, మల్లికార్జున్, యాదగిరి, కె.సి.పాణి, టీఆర్‌సింగ్, మూర్తి, ఆర్.వి.గోపాల్, అంజనేయులు, కేఎస్ నారాయణ, రవీందర్, పాషా తదితరులు పాల్గొన్నారు.
27 నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె
Published Wed, Jan 22 2014 4:28 AM | Last Updated on Thu, Jul 11 2019 7:48 PM
Advertisement