ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ‘సంక్రాంతి’ ఆదాయం
విజయనగరం అర్బన్: సంక్రాంతి ఆర్టీసీకి దండిగా ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. విజయనగరం జోన్ పరిధిలో సర్వీసుల ద్వారా ఈ నెల 19తేదీ ఒక్కరోజున రూ. 4.8 కోట్లు లభించింది. గతంలో ఎప్పుడూ కనీసం రూ. రెండు కోట్లు కూడా వసూలు కాలేదు. జోన్ పరిధిలోని 27 డిపోలలో ఆ రోజూ తిరిగిన దూరం అత్యధికంగా 10.08 లక్షల కిలోమీటర్లుగా నమోదయింది. ప్రతి రోజూ బస్సులు నడిచే దూరం కంటే అదనంగా 1.5 లక్షల కిలోమీటర్ల మేర సర్వీసులు నడిపారు. ఇందుకోసం దాదాపుగా అన్ని డిపోల గ్యారేజీల నుంచి నూరు శాతం బస్సులను వినియోగించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
జోన్ పరిధిలో ఎనిమిది డిపోలు నూరు శాతం ఆక్యుపెన్సీ రేటు (ఓఆర్) సాధించాయి. వాటిలో శ్రీకాకుళం-2, విజయనగరం, సింహాచలం, అనకాపల్లి, తుని, గోకవరం, రాజమండ్రి, కాకినాడ డిపోలున్నాయి. విజయనగరం డిపో నూరుశాతానికి పైగా ఓఆర్ సాధించింది. సాధారణ రోజుల్లో కనీసం రూ 80 లక్షల ఆదాయం కూడా దాటని నార్త్ ఈస్ట్ కోస్ట్ (నెక్) రీజియన్లో తొమ్మిది డిపోల నుంచి ఒక్క రోజుకు రూ.1.72 కోట్లు లభించింది. ప్రయాణికులకు ధన్యవాదాలు: జోన్ ఈ.డీ.రామకృష్ణఆర్టీసీని ఆదరించి రవాణా సేవలను వినియోగించుకున్న ప్రయాణికులకు విజయనగరం జోన్ ఈ.డీ. ఏ.రామకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సంస్థకు చెందిన ప్రతి కార్మికుడికి, ఇతర సిబ్బం దికి, అధికారులకు అభినందనలు తెలిపారు.
కేవలం అక్రమ రవాణా చేసే వాహనాలను, అక్రమ తవ్వకాలు జరిపేవారిని పట్టుకోవడం వరకే పరిమితం చేసి, అపరాధ రుసుం విధించే బాధ్యతను ఆర్డీవోకు అప్పగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు అధికారాల బదలాయింపు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇకపై సబ్ ఇన్స్పెక్టర్, తహశీల్దార్లు అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను పట్టుకుని, వాటి తీవ్రతను తెలియజేసే విధంగా రిపోర్టు ఇవ్వవల్సి ఉంటుందని, దాన్ని ఆధారంగా ఆర్డీఓ అపరాధ రుసుం ఎంతన్నది నిర్ణయించనున్నారు. అంటే ఒక విధంగా సబ్ ఇన్స్పెక్టర్లు, తహశీల్దార్ల అధికారాలను కుదించినట్టే.