ఆర్టీసీ బస్సు- టయోటా ఢీ :ఇద్దరికి తీవ్ర గాయాలు
అనంతపురం: అనంతపురం జిల్లా కూడేరు మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సు, టయోటా వాహనాన్ని ఢీకొట్టడంతో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు... అనంతపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అనంతపురం నుంచి బళ్లారి వెళ్తుండగా కర్ణాటక నుంచి వస్తున్న టయోటా వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో టయోటాలోని ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల 108 కి సమాచారం ఇచ్చారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
(కూడేరు)