కేసీఆర్‌కు రుణపడి ఉంటాం
టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి మోహన్‌లాల్
అచ్చంపేట రూరల్ : ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు 44శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం హర్షించదగ్గ విషయమని, సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని ఆర్టీసీ టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్. మోహన్‌లాల్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే బాలరాజును ఆర్టీసీ కార్మికులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కార్మికులకు ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు.
ఇతర ప్రభుత్వాలు కార్మికులతో వెట్టిచాకిరీ చేయించాయన్నారు. 44శాతం ఫిట్మెంట్ ఇవ్వడంతో తమ బాధ్యత మరింత పెరిగిందన్నారు. రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి ఆర్టీసీని లాభాల బాటలో నడిపిస్తామన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపిన మంత్రి హరీష్‌రావుకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ తమ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని మరోసారి నిరూపించిందన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు ఎంతో కష్టపడి ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించారన్నారు. అన్నివర్గాల ప్రజలకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఎంయూ డిపో సెక్రటరీ దాసపత్రి వెంకటేష్, నాయకులు చంద్రయ్య, వీసీమౌళి, ఎ.జంగిరెడ్డి, కరీం, ఎంజీనాయక్, టీఆర్ఎస్ నాయకులు నర్సింహగౌడ్, సీఎం రెడ్డి, కటకం రఘురాం, అంతటి శివ, రహ్మతుల్లా తదితరులు పాల్గొన్నారు.