Rubber tube
-
ఎంత కష్టమొచ్చింది.. రబ్బర్ ట్యూబ్‌కు మృతదేహం కట్టి నదిలో..!
భోపాల్: భారీ వర్షాల కారణంగా నది ఉప్పొంగి గ్రామానికి దారి లేకుండా మారింది. ఊళ్లోకి వెళ్లాలంటే వరద దాటుకునే వెళ్లాలి. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆ వ్యక్తి మృతదేహాన్ని గ్రామానికి చేర్చేందుకు రబ్బర్ ట్యూబే వారికి ఆసరాగా మారింది. ట్యూబ్‌కు మృతదేహాన్ని కట్టి నది దాటించారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అనుప్పుర్ జిల్లాలోని తాడ్‌పతారా గ్రామానికి చెందిన 55 ఏళ్ల విశ్మాట్ నందా అనే వ్యక్తి పక్క జిల్లా డిండోరాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. అంబులెన్స్‌లో మృతదేహాన్ని పతర్‌కుచాకు తీసుకొచ్చారు. నర్మదా నది వరదలతో ఉప్పొంగటం వల్ల పతర్‌కుచా నుంచి తాడ్‌పతరాకు వెళ్లేందుకు దారి లేకుండా పోయింది. అక్కడ ఎలాంటి వంతెన లేదు. దీంతో రబ్బర్ ట్యూబ్‌కు మృతదేహాన్ని కట్టి నదిని దాటించారు గ్రామస్థులు. ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అభిషేక్ చౌదరి తెలిపారు. डिंडोरी में मृतक के परिजनों से आज़ादी के #अमृतमहोत्सव की अहमियत समझिये गर हिम्मत हो तो! शव को ट्यूब पर रखकर गांव लाये तब अंतिम संस्कार हुआ क्योंकि सरकार या तो पुल बनाती नहीं,बनाती है तो नींव में भ्रष्टाचार डलता है सीमेंट नहीं! @ndtv @ndtvindia pic.twitter.com/ton0fVuLnr — Anurag Dwary (@Anurag_Dwary) August 16, 2022 ఇదీ చదవండి: భారత జాతీయ గీతం ‘జనగణమన’ వినిపించి పాక్ మ్యుజీషియన్ కానుక! -
డబుల్ ధమాకా..
రహదారి మీద, రైలు పట్టాల మీద దూసుకెళ్లే వాహనమిది. ప్రపంచంలోనే తొలి డ్యూయల్ మోడల్ వెహికల్(డీఎంవీ) ఇదేనని జపాన్ చెబుతోంది. టొకుషిమా పరిధిలోని కయో ప్రాంతంలో ఇది శనివారం ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ వాహనం రహదారిపై వెళ్లేపుడు రబ్బరు టైర్లను, పట్టాలపై ప్రయాణించేటపుడు ఇనుప చక్రాలను వాడుతుంది. ఒకేసారి 21 మంది ప్రయాణించవచ్చు. -
గ్లోబస్ స్పిరిట్స్- నోసిల్.. లాభాల కిక్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో లిక్వర్ కంపెనీ గ్లోబస్ స్పిరిట్స్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. మరోపక్క ఇదే కాలంలో నిరుత్సాహకర పనితీరు ప్రదర్శించినప్పటికీ రబ్బర్ కెమికల్స్ కంపెనీ నోసిల్ లిమిటెడ్ కౌంటర్‌కు సైతం డిమాండ్ కనిపిస్తోంది. వెరసి నష్టాల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. గ్లోబస్ స్పిరిట్స్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో గ్లోబస్ స్పిరిట్స్ నికర లాభం 161 శాతం దూసుకెళ్లి రూ. 19 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన పన్నుకు ముందు లాభం రెట్టింపై రూ. 25 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతం క్షీణించి రూ. 292 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో గ్లోబస్ స్పిరిట్స్ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 170 సమీపంలో ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. గత ఐదు నెలల్లో ఈ షేరు 90 శాతంపైగా ర్యాలీ చేయడం విశేషం! నోసిల్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో నోసిల్ లిమిటెడ్ నికర లాభం 64 శాతం నీరసించి రూ. 12 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 54 శాతం క్షీణించి రూ. 107 కోట్లకు పరిమితమైంది. పన్నుకు ముందు లాభం 81 శాతం పడిపోయి రూ. 9.3 కోట్లను తాకింది. కోవిడ్-19 కట్టడికి లాక్‌డవున్ అమలు కారణంగా టైర్ల కంపెనీల నుంచి ప్రొడక్టులకు డిమాండ్ పడిపోయినట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే ఇకపై రబ్బర్ కెమికల్స్‌కు డిమాండ్ పెరిగే వీలున్నట్లు ప్రభుదాస్ లీలాధర్ అంచనా వేసింది. చైనా స్థానే కంపెనీకి మరిన్ని ఆర్డర్లు లభించగలవని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో నోసిల్ షేరు 8 శాతం జంప్‌చేసి రూ. 131 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 132.5 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది! -
లైఫ్‌స్టైల్ డిసీజెస్ కౌన్సెలింగ్
కొలెస్ట్రాల్‌తో అంతా నష్టమేనా? కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెజబ్బులు వస్తాయని ఇటీవల అందరూ అంటున్నారు. అసలు కొలెస్ట్రాల్ అంటే ఏమిటి? దానివల్ల అన్నీ నష్టాలేనా? కొలెస్ట్రాల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో వివరించగలరు. - రమాకాంతరావు, ఏలూరు కొలెస్ట్రాల్‌లో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. ఇందులోని ఎల్డీఎల్ అనే రకాన్ని చెడుకొలెస్ట్రాల్గా చెబుతారు. ఎందుకంటే సాధారణంగా రక్తనాళాలు ఒక రబ్బర్ ట్యూబ్‌లా ఎటుపడితే అటు ఒంగేలా మంచి ఎలాస్టిసిటీతో ఉంటాయి. కానీ ఈ ఎల్డీఎల్ అనేది రక్తనాళం లోపల గారలాగా పట్టేస్తూ ఉంటుంది. దాంతో ఎటుపడితే అటు తేలిగ్గా ఒంగగలిగే రక్తనాళం బిరుసుగా మారడమేగాక లోపలి సన్నబారుతుంది. ఈ కండిషన్‌ను అథెరోస్క్లిరోసిస్ అంటారు. దీని వల్ల గుండెకు రక్తం అందక గుండెపోటు రావచ్చు. కానీ ఇందులోనే మరో రకం కొలెస్ట్రాల్ ఉంది. దీన్ని హెచ్‌డీఎల్ అంటారు. ఇది మంచి కొలెస్ట్రాల్ అన్నమాట. ఇది రక్తనాళం లోపల గారలా పేరుకుపోతున్న చెడు కొలెస్ట్రాల్‌ను తొలుచుకుంటూ, ఒలుచుకుంటూ పోతుంటుంది. అంటే రక్తనాళాల్లోని పూడికను తొలగించే పనిచేస్తుందన్నమాట. అందుకే హెచ్‌డీఎల్ పాళ్లు పెరుగుతున్నకొద్దీ గారలా పేరుకునే చెడు కొలెస్ట్రాల్ చెక్కినట్లుగా తీసేస్తుంటుంది. అందుకే ఇది గుండెపోటు రాకుండా చూసే కొలెస్ట్రాల్ అన్నమాట. ఇక కొవ్వుల్లో మరో రకం కూడా ఉన్నాయి. వాటిని ట్రైగ్లిజరైడ్స్ అంటారు. మనం తిన్న ఆహారంలో ఎక్కువ శక్తిని నిల్వ చేసుకునే ప్రక్రియలో ఈ రకం కొవ్వు పుడుతుంది. అది మళ్లీ రక్తనాళాలు సన్నబడటానికి దోహదం చేస్తుంది. కాబట్టి ఇది ప్రమాదకరమైనది. ఇది కేవలం ఆహారపు శక్తిని నిల్వచేసే సమయంలోనే గాక... మన శరీర బరువు పెరిగినా, స్థూలకాయం వచ్చినా, తగినంత శారీరక శ్రమ చేయకపోయినా, సిగరెట్లు, మద్యం తాగినా పెరుగుతాయి. కాబట్టి ఈ కొవ్వు మంచిది కాదు. ఇక మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకునేందుకూ, మన గుండెను హార్ట్ఎటాక్ రిస్క్‌నుంచి తప్పించుకునేందుకు చేయాల్సిన పని ఏమిటంటే... మనం తీసుకునే ఆహారంలో ఎల్డీఎల్, ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా చూసుకోవాలి. అలాగే హెచ్‌డీఎల్‌ను పెంచుకోవాలి. చెడుకొలెస్ట్రాల్‌ను తగ్గించుకొని, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుకోవాలంటే కరిగే పీచు ఎక్కువగా ఉండే సోయాప్రోటీన్ల వంటి ఆహారంతో పాటు వారానికి కనీసం 150 నిమిషాలు (రోజుకు అరగంట చొప్పున ఐదు రోజులు) వ్యాయామం చేయాలి. దీనివల్ల మంచి కొలెస్ట్రాల్ అయిన హెచ్‌డీఎల్ పెరుగుతుంది. అదే వ్యాయామం చెడుకొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. అందుకే కొలెస్ట్రాల్‌లన్నీ ఒకేలాంటివి కావని గ్రహించడంతో పాటు... వ్యాయామం చేయడం అనే ఒకే చర్య అటు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుందని గ్రహించండి. డాక్టర్ సుధీంద్ర ఊటూరి కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్