కోచ్చడయాన్ ప్రపంచ సినిమా
కోచ్చడయాన్ను తమిళ చిత్రంగా చూడకండి, ఇది ప్రపంచ సినిమా అంటోంది హీరోయిన్ దీపికా పదుకునే. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న అత్యంత భారీ చిత్రం కోచ్చడయాన్. ఇందులో రజనీ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. హాలీవుడ్ చిత్రం అవతార్ తరహాలో రూపొందుతున్న కోచ్చడయూన్ తొలి తమిళ 3డీ చిత్రం కావడం విశేషం.
అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో క్యాప్చరింగ్ టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య అశ్విన్ దర్శకురాలు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వ పర్యవేక్షణ నిర్వహించిన ఈ చిత్రంలో హీరోయిన్గా దీపికా పదుకునే నటిస్తోంది. ఆమె ఇటీవల చెన్నైకి వచ్చిన సందర్భంగా కోచ్చడయాన్ గురించి మాట్లాడింది. కోచ్చడయూన్ అంతర్జాతీయ చిత్రంగా పేర్కొంది. తమిళం, ఆంగ్లం, రష్యన్, జపనీస్, చైనీస్ తదితర భాషల్లో తెరపైకి రానున్నట్లు తెలిపింది.
తనను తాను తొలిసారిగా యానిమేషన్ సన్నివేశాలలో చూసి ఆశ్చర్యపోయూనని వెల్లడించిం ది. కోచ్చడయూన్లోని విజువల్ సన్నివేశాలు ఇంతవరకు ఏ భారతీయ చిత్రంలోనూ చోటు చేసుకోలేదని పేర్కొంది. రజనీకాంత్ నిజంగానే ఇండియన్ సూపర్‌స్టార్ అని పొగడ్తల వర్షం కురిపించింది. సౌందర్య అశ్విన్ శ్రమకు కచ్చితంగా హాలీవుడ్ స్థాయిలో పేరు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. కోచ్చడయాన్ విడుదల కోసం రజనీ అభిమానులు మాదిరిగానే తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వివరించింది. కోచ్చడయూన్ నవంబర్ 1న విడుదల కానున్నట్లు సమాచారం.