ఐపీఎల్ విజేతకు రూ.15 కోట్లు
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రస్తుత సీజన్లో విజేతగా నిలిచిన జట్టు రూ. 15 కోట్లు ఎగరేసుకుపోనుంది. రన్నరప్‌కు రూ.10 కోట్లు ఇవ్వనున్నట్టు ఐపీఎల్ వర్గాలు తెలిపాయి.
ప్లే ఆఫ్‌లో భాగంగా ఫైనల్‌కు చేరుకోవడంలో విఫలమయ్యే మిగతా రెండు జట్లకు రూ.7.5 కోట్ల చొప్పున అందనున్నాయి. ఓవరాల్‌గా ప్లేఆఫ్ నుంచి తుది పోరు వరకు రూ.40 కోట్ల ప్రైజ్‌మనీ పంపిణీ చేయనున్నారు. ఈనెల 27 నుంచి ప్లే ఆఫ్ మ్యాచ్‌లు జరుగుతాయి.