ఎర్ర దొంగల బురిడీ
సాక్షి, అనంతపురం : అటవీశాఖ సిబ్బందిని ఎర్ర చందనం స్మగ్లర్లు బురిడీ కొట్టించారు. జిల్లా అధికారి పేరుచెప్పి రూ.కోటి విలువైన ఎర్రచందనం దుంగలను దర్జాగా తీసుకెళ్లారు. అసలు సంగతి తెలుసుకున్న అధికారులు దొంగలను పట్టుకునేందుకు తంటాలు పడుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్ర బంగారంగా భావించే ఎర్రచందనానికి పెట్టింది పేరు కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలు. ఈ జిల్లాల్లో అపారంగా విస్తరించి ఉన్న అడవుల్లో ఎర్రచందనం వృక్షాల్ని స్మగ్లర్లు తెగనరికి
రాప్తాడు, న్యూస్‌లైన్ : రాప్తాడు మండలం పుల్లలరేవు గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతకు మంత్రి పదవి ఇచ్చినట్లు సమాచారం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు మధ్యాహ్నం నుంచే గ్రామంలో సంబరాల్లో మునిగి తేలారు.
రాత్రి ద్విచక్రవాహనాలకు సెలైన్సర్ తీసి వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్ల ముందు కలియదిరుగుతూ చిందులేశారు. అంతటితో ఆగక ఇంటి ముందు టపాసులు కాలుస్తుండగా వైఎస్సార్సీపీ నేత భాస్కర్‌రెడ్డి తల్లి వెంకటలక్ష్మమ్మ అడ్డుచెప్పడంతో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు కర్రలు, రాళ్లతో దాడిచేశారు.
తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అయినా శాంతించని వారు వైఎస్సార్సీపీ కార్యకర్తలు చెన్నారెడ్డి, మహీధర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, చెన్నారెడ్డి, గంగాధర్, రాజశేఖర్‌రెడ్డి, ఆనంద్రెడ్డితోపాటు మరికొందరిపైనా దాడిచే శారు. మిద్దెలపెకైక్కి రాళ్లు రువ్వారు. దీంతో గ్రామంలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలంతా ఒక్కటై రావడంతో టీడీపీ కార్యకర్తలు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఇటుకలపల్లి ఎస్ఐ శివగంగాధర్‌రెడ్డి, రాప్తాడు ఏఎస్ఐ జనార్ధన్ తమ సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. ఇరు వర్గాల వారినీ చెదరగొట్టి.. బందోబస్తు ఏర్పాటు చేశారు. తీవ్రంగా గాయపడిన వెంకటలక్ష్మమ్మను పోలీసులు 108 వాహనం ద్వారా అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు.
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి
తలుపుల : చిన్నన్నవారిపల్లికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు శివప్రసాద్, శ్రీనివాసులు అతని భార్య రాధపై ఆదివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. వివరాల్లోకెళితే... తెలుగుదేశం ప్రభుత్వం కొలువుదీరిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ కార్యకర్తలు టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో తమ ఇంటివద్ద గొర్రెలు తోలుకున్నామని, ఇక్కడ టపాసులు పేలిస్తే అవి బెదిరిపోతాయని అడ్డు చెప్పినందుకు వైఎస్సార్సీపీ కార్యకర్త శ్రీనివాసులు, అతని భార్య రాధతోపాటు మరో కార్యకర్త శివప్రసాద్‌పై టీడీపీ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేసి గాయపరిచారు. తమపై టీడీపీ కార్యకర్తలు గంగిశెట్టితో పాటు, కాయలపల్లికి చెందిన శేఖర, చంద్ర, రామ్మోహన, పెద్దమల్లేసు, వెంకటయ్య తదితరులు దాడి చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ గోపాలుడు తెలిపారు.