Rural demand
-
6.6% నుంచి 7 శాతానికి అప్
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంక్ పెంచింది. ఎకానమీ పురోగతి ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 6.6 శాతం ఉంటుందన్న తొలి (జూన్ నివేదికలో) అంచనాలను తాజాగా 7 శాతానికి పెంచింది. వ్యవసాయ రంగంలో రికవరీ, గ్రామీణ డిమాండ్ పుంజుకోవడం తమ అంచనాల పెంపునకు కారణంగా తాజా ‘ఇండియన్ డెవలప్మెంట్ అప్డేట్’ నివేదికలో పేర్కొంది. రుతుపవనాల మెరుగుదల, ప్రైవేట్ వినియోగం–ఎగుమతులు పెరిగే అవకాశాలు.. అంచనాల తాజా పెంపుదలకు తోడ్పడినట్లు ప్రపంచ బ్యాంక్ సీనియర్ ఆర్థికవేత్త రాన్లీ చెప్పారు. అవుట్‌లుక్ పాజిటివ్...: అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ మధ్యకాలిక అవుట్‌లుక్ ‘పాజిటివ్’ గా ఉందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేస్తోంది. 2024–25లో 7 శాతం వృద్ధి రేటు నమోదయితే, తదుపరి రెండు ఆర్థిక సంవత్సరాలు (2025–26, 2026–27) ఎకానమీ పటిష్టంగా ఉంటుందని ఉద్ఘాటించింది. -
ఎఫ్ఎంసీజీ కంపెనీలకు ద్రవ్యోల్బణం షాక్! అక్కడ డిమాండ్ ఢమాల్!
ముంబై: ఎఫ్ఎంసీజీ కంపెనీలు వ్యాపారంలో స్తబ్దతను చూస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ సన్నగిల్లడం, అధిక ద్రవ్యోల్బణం పరిస్థితుల నేపథ్యంలో ఎఫ్ఎంసీజీ ఆదాయాల్లో పెద్దగా వృద్ధి కనిపించదని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికే పరిమితం కాకుండా, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే పరిస్థితి కొనసాగొచ్చని పేర్కొంది. 2022-23లో 7-9 శాతం మధ్య ఆదాయంలో వృద్ధి నమోదు కావచ్చన్న అంచనాను వెల్లడించింది. (బడా టెక్ కంపెనీల నియంత్రణలో వైఫల్యం: కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు) గత ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఎంసీజీ పరిశ్రమ ఆదాయం 8.5 శాతం వృద్ధిని చూడడం గమనార్హం. ‘‘రూ.4.7 లక్షల కోట్ల మొత్తం ఆదాయంలో 40 శాతం గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తోంది. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో అధిక ద్రవ్యోల్బణం, తగ్గిన వేతనాలు, కరోనాతో ఉపాధి నష్టం పరిస్థితులు నెలకొన్నట్టు’’ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఎఫ్ఎంసీజీ రంగంపై ఓ నివేదికను విడుదల చేసింది. తయారీ వ్యయాలు పెరగడంతో, మార్జిన్లను కాపాడుకునేందుకు కరోనా అనంతరం విడతల వారీగా రేట్లను ఎఫ్ఎంసీజీ కంపెనీలు పెంచాయి. దీని ప్రభావం కూడా వృద్ధిపై ఉన్నట్టు ఈ నివేదిక వివరించింది. (టెల్కోలకు భారీ ఊరట, 4జీ యూజర్లకు గుడ్ న్యూస్) ధరలు తగ్గితే అనుకూలం.. ద్రవ్యోల్బణం ఇప్పటికీ గరిష్ట స్థాయిల్లోనే ఉన్నందున వచ్చే ఆర్థిక సంవత్సరం సైతం ఆదాయంలో వృద్ధి ఇప్పటి మాదిరే ఉండొచ్చని, ఒకవేళ ధరలు దిగొస్తే పరిస్థితి మెరుగుపడొచ్చన్నది క్రిసిల్ విశ్లేషణ. కంపెనీల నిర్వహణ మార్జిన్లు 1-1.5 శాతం తగ్గి 18-19 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. తయారీ వ్యయాలు (గోధుమ, పాలు, మొక్కజొన్న, బియ్యం, చమురు), మార్కెటింగ్ వ్యయాలు అధికంగా ఉండడాన్ని ప్రస్తావించింది. ఇవి గత నాలుగైదు త్రైమాసికాలుగా పెంచిన ధరల అనుకూలతను తగ్గించినట్టు వివరించింది. ఇక వంట నూనెలు, చక్కెర ధరలు తగ్గినందున కొంత అనుకూలిస్తుందని పేర్కొంది. రూ.4.7 లక్షల కోట్ల ఎఫ్ఎంసీజీ పరిశ్రమలో 35 శాతం వాటా కలిగిన 76 కంపెనీల వివరాలను క్రిసిల్ విశ్లేషించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ మార్జిన్లు 0.50–0.70 శాతం మేర పెరగొచ్చని అంచనా వేసింది. ధరల ప్రభావం.. పట్టణ వినియోగంపై ద్రవ్యోల్బణం (రేట్ల పెరుగుదల) ప్రభావం తక్కువగానే ఉందని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేతి తెలిపారు. 2020-2021లో మాదిరే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ స్తబ్ధుగానే ఉంటుందన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంత్లాలో చిన్న ప్యాకెట్లకు డిమాండ్ పెరగడాన్ని క్రిసిల్ ప్రస్తావించింది. పంటలకు అధిక కనీస మద్దతు ధరలు, సాగు దిగుబడి మెరుగ్గా ఉండడం గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ వచ్చే ఆర్థిక సంత్సరంలో పుంజుకుంటుందని చెప్పడానికి సంకేతాలుగా తెలియజేసింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం పట్టణాల్లో డిమాండ్ స్థిరంగా ఉంటుందని క్రిసిల్ అంచనా వేసింది. ఇక ఫుడ్ అండ్ బెవరేజెస్ అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరంలో 8-10 శాతం పెరగొచ్చని పేర్కొంది. గృహ సంరక్షణ, వ్యక్తిగత సంరక్షణ అమ్మకాల్లో 6-8 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. -
ఇది పేదరికానికి సూచిక!
సాక్షి, న్యూఢిల్లీ: వివిధ వస్తువులను వాడటంలో వినియోగదారుల డిమాండ్‌కు సంబంధించి జాతీయ గణాంక సంస్థ (ఎన్ఎస్ఓ) ఓ సర్వేను విడుదల చేసింది. సర్వే ప్రకారం గత నలబై ఏళ్లుగా ఎన్నడు లేని విధంగా గ్రామీణ డిమాండ్ పడిపోయిందని తెలిపింది. ఆర్థిక సంవత్సరం (2011-12) ప్రతి నెలలో 1,501రూపాయలు ఖర్చు చేసేవారని, కానీ ప్రస్తుతం (2017-2018) సర్వే ప్రకారం 3.7శాతానికి తగ్గి 1,446 రూపాయలు ఖర్చు చేస్తున్నారని నివేదిక తెలిపింది. ఈ నివేదికలు రూపొందించడానికి (2009-10)ను ఆధార సంవత్సరంగా తీసుకుంటారు. నెలవారీ తలసరి వినియోగ వ్యయం (ఎంపిసిఇ) (2011-12)లో 13శాతం పెరిగిందని నివేదిక తెలిపింది. మరోవైపు గ్రామాల్లో వినియోగదారుల వ్యయం 2018సంవత్సరంలో 8.8శాతం తగ్గగా.. నగరాల్లో 2శాతం పెరిగిందని నివేదిక స్పష్టం చేసింది. గ్రామీణ మార్కెట్ డిమాండ్ తగ్గడమనేది దేశంలో పెరుగుతున్న పేదరికానికి సూచిక అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
గ్రామీణ డిమాండ్‌కు గడ్డు పరిస్థితి
♦ బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా ♦ వర్షాభావం ప్రభావం ఉంటుందని విశ్లేషణ న్యూఢిల్లీ: గ్రామీణ డిమాండ్ తగ్గే అవకాశం ఉందని గ్లోబల్ ఫైనాన్షియల్ సేవల దిగ్గజ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్ (బీఓఎఫ్ఏ)తన తాజా నివేదికలో పేర్కొంది. వర్షాభావ పరిస్థితులు, అంతర్జాతీయంగా వ్యవసాయ ఉత్పత్తులు తక్కువగా ఉండడం వంటివి దీనికి ప్రధాన కారణంగా వివరించింది. గ్రామీణ డిమాండ్నుపునరుద్ధరించడమే ప్రభుత్వం ముందు ఉన్న ప్రధాన లక్ష్యమని పేర్కొంది. ఇందుకు స్వామినాథన్ ఫార్ములాను క్రమంగా అమలు పరచాల్సి ఉంటుందనీ సూచించింది. వరి, గోధుమలకు కనీస మద్దతు ధర వ్యయానికన్నా 50 శాతం అధికంగా ఉండాలని ఈ ఫార్ములా సూచిస్తోంది. 2017 వరకూ పెట్టుబడుల ఆధారితంగా ఆర్థిక వృద్ధి అవకాశాలు లేవని పేర్కొన్న బ్యాంక్, అప్పటి వరకూ ఆర్థిక వ్యవస్థకు వినియోగ ఆధారిత రికవరీనే మార్గమని వివరించింది. వేతన కమిషన్ సిఫారసుల అమలు, రేటు కోత, చమురు ధరలు తక్కువగా ఉండడం వల్ల గృహాల పొదుపురేట్లు పెరగడం వంటి అంశాలు 2016 మధ్యలో జీడీపీ విలువను ఒక శాతం మేర పెంచే వీలుందని వివరించింది. అయితే ఈ విషయంలో గ్రామీణ డిమాండ్ పెరుగుదలను తాము పరిగణనలోకి తీసుకోవడం లేదని వివరించింది. ద్రవ్యలోటు లక్ష్యం కష్టమే: యూబీఎస్ ఇదిలావుండగా... వృద్ధి మందగమనం వల్ల ద్రవ్యలోటు లక్ష్యాల విషయంలో ప్రభుత్వం పునరాలోచనలో పడే వీలుందని మరో గ్లోబల్ ఫైనాన్షియల్ సేవల దిగ్గజం యూబీఎస్ అభిప్రాయపడింది. వేతన కమిషన్ సిఫారసుల అమలు, డిమాండ్‌ను పెంచాల్సిన అవసరం వంటి అంశాల నేపథ్యంలో ప్రభుత్వ వ్యయాలు పెరిగి ద్రవ్యలోటు అంచనాలు దాటే వీలుందని ఒక నివేదికలో విశ్లేషించింది.