విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని ఎంచుకోవాలి
పర్వతగిరి , న్యూస్‌లైన్ : విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని ఎంచుకుని సాధన చేస్తే అత్యున్నత స్థానానికి చేరుకుంటారని ప్రముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. శనివారం మండలంలోని కల్లెడ రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ (ఆర్డీఎఫ్) పాఠశాలను సందర్శించి కంప్యూటర్ ల్యాబ్, విద్యార్థుల సైన్స్‌ఫేర్, బాలా మేళాను తిలకిం చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్ననాటి నుంచే విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నతస్థాయికి చేరుకోవాలన్నారు. మం చి లక్ష్యాన్ని ఎంచుకుని అంకితభావంతో కృషి చేస్తే సాధించలేనిది ఏమీ లేదన్నారు.
విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. నేటి బాలలే రేపటి పౌరులని, భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నా రు. ఆర్డీఎఫ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కల్లెడ రూరల్ పాఠశాలలో పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించడంతో పాటు జి ల్లాలో మూడు పాఠశాలలను నిర్వహించడం హర్షణీయమన్నారు. పల్లెల్లో ఇలాంటి మంచి పాఠశాలను సందర్శించడం తనకు ఓ మధురానుభూతిని ఇచ్చిందన్నారు.
ఈ సందర్భంగా పలువురు పాఠశాల విద్యార్థులు చేసిన ఎగ్జిబిట్స్ను పరిశీలించారు. విద్యార్థులతో తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీఎఫ్ సీఈఓ ఎర్రబెల్లి వం దితారావు, హెచ్ఎంలు శ్రీధర్, చేరాలు, అసిస్టెంట్ హెచ్ఎం రాచకొండ అశోకాచారి, ఉపాధ్యాయులు మహేందర్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, మురళీకృష్ణ, అశోక్, పాఠశాల విద్యా క మిటీ సభ్యులు రమేశ్, రామలింగం, ముస్తఫా, మోహన్, సారంగపాణి పాల్గొన్నారు.