Rural Service
-
జూడాల మానవహారం
పన్నెండో రోజుకు చేరిన సమ్మె విజయవాడ : తప్పనిసరిగా గ్రామీణ సర్వీసు చేయాలని ప్రభుత్వం విడుదల చేసిన జీవో 107 రద్దు చేయాలని, తమ డిగ్రీలు తక్షణమే రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతూ జూనియర్ వైద్యులు చేపట్టిన సమ్మె సిద్ధార్థ వైద్య కళాశాలలో 12వ రోజు కొనసాగింది. అత్యవసర సేవలు మినహా అన్ని సేవలు బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు సిద్ధార్థ వైద్య కళాశాల ఎదుట ఆందోళన చేస్తున్న జూడాలు బుధవారం పాత ప్రభుత్వాస్పత్రికి చేరుకుని సమీపంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ ఎదుట మానవహారం నిర్వహించారు. దీంతో నలువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. అసోసియేషన్ నాయకుడు డాక్టర్ తనోజ్ , డాక్టర్ కార్తీక్, డాక్టర్ క్రాంతికుమార్, స్నిగ్థ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు జూనియర్ వైద్యులు సమ్మె చేయడంతో అవుట్పేషెంట్లకు ఇబ్బందులు తప్పడం లేదు. వార్డులో చికిత్స పొందుతున్న వారిని సైతం పర్యవేక్షించే వారు లేకపోవడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోననే ఆందోళనతో అధికారులు తలలు పట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. -
చేతికి నల్లరిబ్బన్లతో జూడాల వినూత్న నిరసన
సీనియర్ రెసిడెంట్లూ సమ్మెలోకి విజయవాడ : గ్రామీణ సర్వీసు పేరుతో ప్రభుత్వం విడుదల చేసిన జీవో నం. 107ను రద్దు చేయాలని, ఆ సర్వీసును కంపల్ సరీగా కాకుండా వలంటరీ సర్వీసుగా మార్పుచేయాలని డిమాండ్ చేస్తూ జూడాలు చేస్తున్న సమ్మె మూడో రోజూ కొనసాగింది. సోమవారం జూడాలు సిద్ధార్థ వైద్య కళాశాల నుంచి రెండు చేతులకు సంకెళ్లలా నల్లరిబ్బన్లు కట్టుకుని వినూత్న రీతిలో ర్యాలీ నిర్వహించారు. జీవో రద్దులో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకునే వరకూ సమ్మె విరమించేది లేదని తేల్చి చెప్పారు. ఉత్తర్వులను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికే ఉందని, కోర్టు తీర్పు ప్రకారం నిర్ణయం తీసుకుందామని చెప్పడం సమంజసం కాదన్నారు. స్పందించకుంటే అత్యవసర సేవలను సైతం బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు. రెండు రోజుల పాటు పోస్టుగ్రాడ్యుయేషన్ విద్యార్థులు, హౌస్సర్జన్లు మాత్రమే విధులు బహిష్కరించగా, సోమవారం నుంచి కంపల్ సరీ సర్వీసు చేస్తున్న సీనియర్ రెసిడెంట్లు కూడా సమ్మెలో పాల్గొన్నారు. దీంతో వార్డుల్లో రోగులకు సేవలందించడం కష్టతరంగా మారింది నేడు స్వచ్ఛ భారత్ జూడాల సమ్మెలో భాగంగా మంగళవారం ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ తనూజ్ తెలిపారు. -
ఉద్రిక్తంగా మారిన జూడాల ఆందోళన
హైదరాబాద్ : జూనియర్ డాక్టర్ల సమ్మె ఉద్రిక్తతలకు దారి తీసింది. రూరల్ సర్వీస్‌పై మెడికల్ కౌన్సెలింగ్‌ను అడ్డుకునేందుకు జూనియర్ డాక్టర్లు బుధవారం యత్నించారు. ఈ సందర్భంగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు, జూనియర్ డాక్టర్లకు వాగ్వాదం చోటుచేసుకుంది. మరోవైపు ముందస్తుగా పలువురు జూనియర్ డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో కోఠి వైద్య విద్యా కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకుని, బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. కాగా పీజీ వైద్యులు రూరల్ సర్వీస్ చేయాలనే ప్రతిపాదనను తొలగించాలని ఉస్మానియా జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేస్తూ అత్యవసర సేవల మినహా అన్ని సేవలు బహిష్కరించిన విషయం తెలిసిందే. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. -
ఉద్రిక్తంగా మారిన జూడాల ఆందోళన
-
రూరల్ సర్వీస్‌ను రద్దు చేయాలి
ఆందోళనకు దిగిన జూ.వైద్యులు దత్తాత్రేయనగర్/సుల్తాన్‌బజార్: పీజీ వైద్యులు రూరల్ సర్వీస్ చేయాలనే ప్రతిపాదనను తొలగించాలని ఉస్మానియా జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. సోమవారం ఆస్పత్రిలో అత్యవసర సేవల మినహా అన్ని సేవలు బహిష్కరించి గేటు వద్ద బైఠాయించారు. జూడాలు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు కమిటీలు వేసి కాలయాపన చేశాయని, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రూరల్ సర్వీస్ చేయాలనే నిబంధనను తొలగించి, పీజీ పూర్తి కాగానే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులుగా ప్రకటించాలన్నారు. సుల్తాన్‌బజార్‌లో: సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, కోఠి ఈఎన్టీ ఆస్పత్రుల్లోను జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించారు. దీంతో వచ్చిన రోగులు ఇబ్బందులకు గురయ్యారు. అనంతరం కోఠి డీఎంఈ కార్యాలయం ముందు జూడాలు బైఠాయించి ధర్నా చేశారు. ఈ ధర్నాకు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం సంఘీభావం తెలిపింది. జూడాల తెలంగాణ జిల్లాల అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం రద్దు చేసినట్టు సంవత్సర కాలం గ్రామాల్లో పని చేయాలనే నిబంధనను తెలంగాణ ప్రభుత్వం సైతం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ, కమ్యూనిటీ హెల్త్ సర్వీసెస్, టీచింగ్ ఆస్పత్రుల్లో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. నిమ్స్‌తో సమానంగా రెసిడెన్షియల్ విధానం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారం జరిగే వరకు ఆందోళన చేస్తామన్నారు.