Russel
-
ఇదేం వింత ప్రకటన..రక్తపింజరను పట్టుకురావడమా..?
ప్రభుత్వాలు నేరస్తులను పట్టుకునేందుకు రివార్డులు ప్రకటించడం చూశాం. అంతగా లేకపోతే కాస్త ధనవంతులు తమ వాళ్ల కోసం, లేదా పోయిన వస్తువులు తీసుకొస్తే వేలల్లో డబ్బిస్తామని ప్రకటించడం విని ఉంటారు. ఇలాంటి ప్రమాదకరమైన వింత ప్రకటన గురించి మాత్రం విని ఉండరు. ఇలాంటి వింత ప్రకటన ఇచ్చిన తొలి ప్రభుత్వం ఆ దేశమే కాబోలు. ఏం జరిగిందంటే..బంగ్లాదేశ్‌లో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఆ దేశ అవామీ లీగ్ పార్టీ జనరల్ సెక్రటరీ షాహ్ మద్ ఇష్తియాక్ ఆరిఫ్ ఓ వింత ప్రకటన చేశాడు. ఆయన ఎవరైనా.. రక్తపింజరి పాముని చంపితే వారికి రూ. 35 వేలకుపైగా పారితోషకం ఇస్తామని ప్రకటించాడు. అందుకు సంబంధించిన విషయం నెట్టింట తెగ వైరల్ అయ్యింది కూడా. ఆ తర్వాత రోజునే మాట మార్చి రక్తిపంజరిని పట్టుకొచ్చిన వారికే ఆ రివార్డు అని ప్రకటించాడు ఆరిఫ్. అయితే అలియాబాద్ యూనియన్‌లో రెజాల్ అనే రైతు ఈ విషయం తెలుసుకుని బహుమతి ఎలాగైన పొందాలని అనుకుంటాడు. అనుకున్నదే తడువుగా రక్తపింజరని రెజాల్ తన స్నేహితుల సాయంతో ప్రాణాలు పణంగా పెట్టి మరీ పట్టుకున్నాడు. దాన్ని ఓ పెద్ద వంటపాత్రలో ప్యాక్ చేసి నేరుగా ఫరిదీపూర్ ప్రెస్క్లబ్కి తీసుకువచ్చాడు. అయితే ఆ ప్రభుత్వం రెజాల్కు మొండి చేయి చూపి ఇంతవరకు ఎలాంటి పారితోషకం అందజేయలేదు. ఇక ఎదురు చూసి.. చూసి.. రెజాల్ రెండు రోజుల క్రితమే ఆ పాముని చంపినట్లు తెలిపాడు. ఇలా రెజాల్ మాదిరిగా చాలామంది ఆ ప్రకటనను చూసి రక్తపింజర్లను పట్టుకుని నగరానికి వస్తుండటం గమనార్హం. వారందరికీ కూడా ఎలాంటి రివార్డు దక్కలేదు. అయితే సదరు పార్టీ నేత మాటమార్చి.. పాములు పర్యావరణంలో భాగమే. కాకపోతే ఫరీద్పూర్ ప్రజలు వీటివల్ల భయపడుతున్నారని ఇలా ప్రకటించామే తప్ప ప్రతిఫలం ఇస్తామనలేదంటూ బుకాయించాడు. పైగా ప్రకటించిన రివార్డు గురించి ఊసెత్తిన పాపాన పోలేదు. అబ్బా..! నాయకులు ఎంతలా మాట మార్చగలరు అని అక్కడ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. నిజానికి ఇలా ప్రకటించడం చట్ట విరుద్ధమని ఫరీద్పూర్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ గోలమ్ ఖుద్దూస్ భుయాన్ అన్నారు. నిజానికి ఈ పారితోషకం కోసం ప్రాణాలు పణంగా పెట్టారు వారంతా..ఒకవేళ ఆ క్రమంలో చనిపోవడం లేదా గాయపడటం జరిగితే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ఫైర్ అయ్యారు. ఇలాంటి ప్రకటనలు కారణంగా చాల పాములు చనిపోయే అవకాశం ఉంటుందన్నారు. వాటిని పట్టుకున్న వారంతా మనుషులు సంచరించిన ప్రదేశంలో విడిచిపెట్టాలని సదరు ఫారెస్ట్ ఆఫీసర్ విజ్ఞప్తి చేశారు కూడా. (చదవండి: పసుపు ఆరోగ్యంపై ఇంతలా ప్రభావవంతంగా పనిచేస్తుందా?) -
క్రికెట్లో అడుగుపెట్టనున్న ఉసేన్ బోల్ట్.. ఏ లీగ్‌లో ఆడనున్నాడంటే!
Usain Bolt set to play T20 cricket..?: ఎనిమిది సార్లు ఒలింపిక్ బంగారు పతక విజేత, జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ త్వరలో తన కలను సాకారం చేసుకోనున్నాడు. చిన్నతనం నుంచి తనకు ఇష్టమైన క్రికెట్లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. మధ్య ప్రాచ్యం (మిడిల్ ఈస్ట్) లో త్వరలో నిర్వహించబోతున్న ఓ టీ20 లీగ్ లో బోల్ట్ పాల్గోనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఓ భారత డిజిటల్ స్పోర్ట్స్ ఛానల్ ఈ లీగ్ కోసం బోల్ట్‌ను సంప్రదించున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరికొద్దిరోజుల్లో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశముంది. కాగా బోల్ట్ ఎనిమిది సార్లు ఒలిపింక్స్‌లో బంగారు పతక విజేతగా నిలిచాడు. అదే విధంగా 2009 బెర్లిన్‌లో జరిగిన ఐఏఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్లను 9.58 సెకన్లలో పూర్తి చేశాడు. ఇదే ప్రస్తుతం ప్రపంచ రికార్డును కలిగి ఉంది. కాగా ఇటీవల రన్నింగ్ నుంచి బోల్ట్ రిటైర్మ్మెంట్ ప్రకటించాడు. అయితే చాలా సందర్బాల్లో క్రికెట్ అంటే ఇష్టమని బోల్ట్ తెలిపాడు . తన తండ్రి కోరికకు తలొగ్గి రన్నింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నానని, క్రికెట్ ఎప్పుడూ తన ‘ఫస్ట్ లవ్’ అని బోల్ట్ చాలా సందర్బాల్లో వెల్లడించాడు. కాగా క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్ సూపర్ స్టార్లు జమైకాకు చెందినవారే. చదవండి: Ben Stokes 56 Number Armband: 56వ నెంబర్‌తో బరిలోకి.. నాన్నకు ప్రేమతో -
ప్రధాని మోదీకి విండీస్ క్రికెటర్ రసెల్ ధన్యవాదాలు
జమైకా: జమైకాకు కరోనా వైరస్ వ్యాక్సిన్లను పంపినందుకు విండీస్ ఆటగాడు ఆండ్రీ రసెల్ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. "ప్రధాని మోదీకి, భారత హైకమిషనర్‌కు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. ఈ చర్యతో మన రెండు దేశాల మధ్య బంధాలు మరింత బలపడ్డాయి" అంటూ రసెల్ బుధవారం ట్విటర్ వేదికగా వీడియోను పోస్ట్ చేశాడు. కాగా, మార్చి 8న మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్లను భారత్ జమైకాకు పంపింది. దీంతో జమైకా ప్రధాని ఆండ్రూ హోల్నెస్ భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాడు. "భారత ప్రభుత్వం పంపిన 50000 డోసుల ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను అందుకున్నట్లు చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను" అంటూ ట్వీట్ చేశాడు. కరోనా నివారణకు ఇంతటి సహాయం చేసిన భారత ప్రభుత్వానికి , ప్రజలకు మా దేశ ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నాడు. 'వ్యాక్సిన్ మైత్రి' పేరుతో ఇతర దేశాలకు వ్యాక్సిన్లు కాగా, కోవిడ్ వ్యాక్సిన్లను కరేబియన్ దీవులకు పంపినందుకుగానూ గతవారం, వెస్టిండీస్ మాజీ క్రికెటర్లు వివియన్ రిచర్డ్స్, రిచీ రిచర్డ్సన్, జిమ్మీ ఆడమ్స్ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇరుదేశాల మధ్య భవిష్యత్తులోనూ ఇలాంటి స్నేహ సంబంధాలే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో ఇంతటి సహాయం చేసిన భారత ప్రజలకు కూడా వారు కృతజ్ఞతలు తెలిపారు. జమైకా, బార్బడోస్, సెయింట్ లూషియా, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ తదితర దీవులు భారత్ నుంచి వ్యాక్సిన్ డోసులు అందుకున్నాయి. 'I want to say a big thank you to PM @narendramodi & @hcikingston. The #COVID19 Vaccines are here & we are excited.' @PMOIndia '#India & #Jamaica - We are more than close, we are now brothers'. WI Cricketer Andre Russell praises #VaccineMaitri @Russell12A @DrSJaishankar pic.twitter.com/LhGi5OQeED — India in Jamaica (@hcikingston) March 16, 2021 -
అందుకే ఐపీఎల్‌కు ఆదరణ
హర్షా భోగ్లే ప్రతీ జట్టుకు పోటాపోటీ విజయాలతో ముందుకెళ్లే అవకాశాలు రావడమే ఐపీఎల్ విజయ సూత్రం. ఈ సీజన్ కూడా దీన్ని నిరూపించింది. లీగ్ మ్యాచ్‌లు ముగిసేవరకు కూడా ప్లే ఆఫ్ బెర్త్ ఆరు జట్ల మధ్య దోబూచులాడింది. అందుకే ఐపీఎల్ ప్రతీ సీజన్లో అత్యంత ఆదరణ పొందుతోంది. నేడు జరిగే చివరి లీగ్ మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కోల్‌కతా.... ఢిల్లీతో బెంగళూరు ఆడబోతున్నాయి. ఇందులో సన్‌రైజర్స్ మినహా అన్నింటికీ గెలుపే లక్ష్యంగా ఉంది. డెక్కన్ చార్జర్స్ పతనం నుంచి పుట్టిన సన్‌కు మంచి వ్యూహ బృందం ఉంది. తమ రిజర్వ్ బెంచ్ పరిమితి తెలుసు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆడుతూ టాప్‌లో కొనసాగుతోంది. కోల్‌కతాకు రస్సెల్ గాయం ఆందోళనపరిచేదే. పిచ్ టర్న్ అయితే కోల్‌కతాకు అవకాశాలుంటాయి. ఇక రాత్రి మ్యాచ్‌లో పరిస్థితి మరోలా ఉంది. ఎలాంటి బౌలింగ్‌నైనా తుత్తునియలు చేసే స్టార్ హిట్టర్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఉండగా గెరిల్లా తరహాలో పోరాడేందుకు ఢిల్లీ డేర్‌డెవిల్స్ సిద్ధమవుతోంది. రాయ్‌పూర్‌లో బ్యాటింగ్ పిచ్ ఎదురుకానుండడంతో ఢిల్లీ బౌలింగ్ ఓ స్థాయిలో ఉండాల్సిందే. ఛేజింగ్ చేయాల్సి వస్తే మోరిస్, బ్రాత్వైట్ల ఇన్నింగ్స్ కీలకం. కోహ్లి, డి విలియర్స్తోనే ఇబ్బందిగా ఉంటే ఇప్పుడు వారికి జతగా గేల్ కలిశాడు. పేరుకు ఇది ఢిల్లీకి హోం మ్యాచ్ అయినా ఆర్సీబీకే ఎక్కువ మద్దతు లభిస్తుందేమో.