Russia Grand Prix
-
హామిల్టన్‌కు నిరాశ
సోచి (రష్యా): దిగ్గజ రేసర్ మైకేల్ షుమాకర్ పేరిట 91 టైటిల్స్‌తో ఉన్న ప్రపంచ రికార్డును సమం చేసేందుకు మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరో రెండు వారాలు వేచి చూడక తప్పదు. ఆదివారం జరిగిన రష్యా గ్రాండ్‌ప్రి రేసులో హామిల్టన్‌కు ఈ అవకాశం వచ్చినా ప్రాక్టీస్ సమయంలో రెండుసార్లు అతను నిబంధనలు ఉల్లంఘించాడు. ప్రాక్టీస్‌కు అనుమతిలేని ప్రాంతంలో కారు డ్రైవ్ చేస్తూ ట్రాక్‌పై రెండుసార్లు రావడంతో అతనిపై 10 సెకన్ల పెనాల్టీని విధించారు. ఫలితంగా ‘పోల్ పొజిషన్’తో రేసును ప్రారంభించిన ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ చివరకు మూడో స్థానంలో నిలిచాడు. రెండో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన మెర్సిడెస్ జట్టుకే చెందిన వాల్తెరి బొటాస్ నిర్ణీత 53 ల్యాప్‌లను గంటా 34 నిమిషాల 00.364 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. బొటాస్ కెరీర్లో ఇది తొమ్మిదో టైటిల్‌కాగా ఈ సీజన్లో రెండో విజయం. ప్రస్తుతం 10 రేసులు ముగిశాక హామిల్టన్ 205 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. బొటాస్ (161 పాయింట్లు), వెర్స్టాపెన్ (128 పాయింట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. సీజన్‌లోని తదుపరి రేసు జర్మనీ గ్రాండ్‌ప్రి అక్టోబర్ 11న జరుగుతుంది. రష్యా గ్రాండ్‌ప్రి ఫలితాలు (టాప్–10): 1. బొటాస్ (మెర్సిడెస్), 2. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 3. హామిల్టన్ (మెర్సిడెస్), 4. సెర్గియో పెరెజ్ (రేసింగ్ పాయింట్), 5. రికియార్డో (రెనౌ), 6. లెక్లెర్క్ (ఫెరారీ), 7. ఒకాన్ (రెనౌ), 8. క్వియాట్ (అల్ఫాటౌరి) 9. పియరీ గాస్లీ (అల్ఫాటౌరి), 10. అలెగ్జాండర్ ఆల్బోన్ (రెడ్‌బుల్). -
హామిల్టన్‌కే పోల్ పొజిషన్
సోచి: ఫార్ములావన్ రేసింగ్ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన మైకేల్ షుమాకర్ (91 టైటిల్స్) పేరిట ఉన్న రికార్డును సమం చేయడానికి మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరింత చేరువయ్యాడు. శనివారం జరిగిన రష్యా గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 31.304 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కు పోల్ పొజిషన్ దక్కడం ఎనిమిదోసారి కావడం విశేషం. ఈ ఏడాది ఆరు టైటిల్స్ నెగ్గిన బ్రిటన్ డ్రైవర్ హామిల్టన్ రష్యా గ్రాండ్‌ప్రిలోనూ నెగ్గితే 91వ టైటిల్‌తో షుమాకర్ రికార్డును సమం చేస్తాడు. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) రెండో స్థానం నుంచి... బొటాస్ (మెర్సిడెస్) మూడో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. -
రైట్ రైట్... రోస్‌బర్గ్
► రష్యా గ్రాండ్‌ప్రిలోనూ మెర్సిడెస్ డ్రైవర్ హవా ► సీజన్లో వరుసగా నాలుగో టైటిల్ సొంతం సోచి (రష్యా): వేదిక మారినా... రేసు మారినా... ఫలితం మారలేదు. మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ఈ ఏడాది తన అద్వితీయమైన ఫామ్‌ను కొనసాగిస్తూ వరుసగా నాలుగో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన రష్యా గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ విజేతగా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ప్రారంభించిన రోస్‌బర్గ్ నిర్ణీత 53 ల్యాప్‌లను గంటా 32 నిమిషాల 41.997 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఇంతకుముందు ఆస్ట్రేలియా, బహ్రెయిన్, చైనా గ్రాండ్‌ప్రి రేసుల్లోనూ రోస్‌బర్గ్ టైటిల్ నెగ్గిన సంగతి తెలిసిందే. ఓవరాల్‌గా రోస్‌బర్గ్‌కిది వరుసగా ఏడో విజయం కావడం విశేషం. గతేడాది చివరి మూడు రేసుల్లోనూ నెగ్గిన ఈ జర్మన్ డ్రైవర్ ఈ సీజన్లో జరిగిన తొలి నాలుగు రేసుల్లోనూ చాంపియన్‌గా నిలిచాడు. తద్వారా వరుసగా ఏడు అంతకంటే ఎక్కువ రేసుల్లో గెలిచిన నాలుగో డ్రైవర్‌గా గుర్తింపు పొం దాడు. గతంలో వెటెల్ (జర్మనీ) 2013లో వరుసగా తొమ్మిది రేసుల్లో గెలుపొందగా... షుమాకర్ , అస్కారి వరుసగా ఏడేసి రేసుల్లో నెగ్గారు. ఈ ముగ్గురి సరసన రోస్‌బర్గ్ చేరాడు. ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్) ఈ రేసులో ఆకట్టుకున్నాడు. పదో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన అతను రెండో స్థానాన్ని సంపాదించాడు. రైకోనెన్ (ఫెరారీ) మూడో స్థానంతో సంతృప్తి పడ్డాడు. రైకోనెన్ ఫలితంతో ఎఫ్1 చరిత్రలో 700సార్లు టాప్-3లో నిలిచిన జట్టుగా ఫెరారీ గుర్తింపు పొందింది. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టుకు మిశ్రమ ఫలితాలు లభించాయి. పెరెజ్ తొమ్మిదో స్థానాన్ని పొందగా... హుల్కెన్‌బర్గ్ తొలి ల్యాప్‌లోనే వైదొలిగాడు. సీజన్‌లోని తదుపరి రేసు స్పెయిన్ గ్రాండ్‌ప్రి ఈనెల 15న జరుగుతుంది. -
రోస్‌బర్గ్... మూడోసారి
మెర్సిడెస్ డ్రైవర్‌కు ‘పోల్ పొజిషన్’ నేడు రష్యా గ్రాండ్‌ప్రి సోచి (రష్యా): సహచరుడు లూయిస్ హామిల్టన్ జోరుకు పగ్గాలు వేస్తూ మెర్సిడెస్ డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ఈ సీజన్లో మూడోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన రష్యా గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో రోస్‌బర్గ్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 37.113 సెకన్లలో పూర్తి చేశాడు. తద్వారా ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన హామిల్టన్ రెండో స్థానం నుంచి, బొటాస్ (విలియమ్స్) మూడో స్థానం నుంచి, వెటెల్ (ఫెరారీ) నాలుగో స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్, సెర్గియో పెరెజ్ వరుసగా ఆరు, ఏడు స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు. ఈ సీజన్లో జరిగిన 14 రేసుల్లో హామిల్టన్ తొమ్మిదింటిలో నెగ్గగా... రోస్‌బర్గ్ మూడింటిలో, వెటెల్ రెండింటిలో గెలిచారు.