Russia tennis
-
నేను రష్యన్‌ను కాను.. నన్ను వింబుల్డన్ ఆడనివ్వండి..!
Natela Dzalamidze: ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాను క్రీడా ప్రపంచం మొత్తం సామూహికంగా బహిష్కరించిన నేపథ్యంలో ఓ టెన్నిస్ క్రీడాకారిణి తన కెరీర్ కోసం రష్యా పౌరసత్వాన్ని వదులుకునేందుకు సిద్ధమైన వార్త ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 27 నుంచి ప్రారంభంకానున్న వింబుల్డన్-2022 పాల్గొనేందుకు రష్యాకు చెందిన నటేల జలమిడ్జే ఏకంగా తన జాతీయతను మార్చుకోవాలని డిసైడైంది. తాను రష్యన్ కాదని.. జార్జియా తరఫున ఆడతానని నటేల వింబుల్డన్ నిర్వాహకులను మొరపెట్టుకుంది. Tennis player Natela Dzalamidze, who was born in Moscow, will be able to get around the ban on Russians at Wimbledon this year Because she now represents the country of Georgia https://t.co/DySjBJtdIz — Bloomberg UK (@BloombergUK) June 20, 2022 రష్యా ఆటగాళ్లెవరూ వింబుల్డన్‌లో పాల్గొనడానికి వీళ్లేదని టోర్నీ నిర్వహకులు స్పష్టం చేసిన నేపథ్యంలో నటేల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 29 ఏళ్ల నటేల అలగ్జాండ్ర క్రునిక్ (సెర్బియా)తో కలిసి మహిళల డబుల్స్‌లో పాల్గొనేందుకు తన పేరును రిజిస్టర్ చేసుకుంది. కాగా, ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాను, ఆ దేశానికి వంతపాడుతున్న బెలారస్‌ను అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం సహా తైక్వాండో, ఫిఫా, ఎఫ్1 రేస్ వంటి ప్రఖ్యాత క్రీడా సంఘాలు ఇదివరకే వెలివేసిన (నిషేధం) విషయం తెలిసిందే. చదవండి: కోచ్‌పై గట్టిగా అరిచిన ప్రపంచ నంబర్1 ఆటగాడు.. వీడియో వైరల్..! -
రష్యన్ టెన్నిస్ ప్లేయర్లకు షాక్.. వింబుల్డన్‌కు దూరమయ్యే అవకాశం!
ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యా వైఖరిని నిరసిస్తూ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ నిర్వహించే ఆల్ ఆంగ్లండ్ లాన్ టెన్నిస్ క్లబ్(AELTC) రష్యన్ టెన్నిస్ ప్లేయర్లకు షాక్ ఇవ్వనుంది. జూన్ 27-జూలై 10 మధ్య జరగనున్న వింబుల్డ్న్కు రష్యా, బెలారస్‌కు చెందిన ఆటగాళ్లను దూరంగా ఉంచాలని బ్రిటీష్ ప్రభుత్వానికి ఏఈఎల్టీసీ నివేధించింది. ఈ మేరకు పురుషుల విభాగంలో వరల్డ్ నెంబర్-2.. డానిల్ మెద్వెదెవ్‌తో పాటు ఎనిమిదో ర్యాంకర్ ఆండ్రీ రుబ్లేవ్ దూరం కానుండగా.. మహిళల విభాగంలో 15వ ర్యాంకర్ అనస్తాసియా పావ్లియుచెంకోవా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా మిలటరీ ఆపరేషన్‌కు ప్రధాన కారణమైన బెలారస్‌ను కూడా వింబుల్డన్ నుంచి బహిష్కరించే అవకశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ టెన్నిస్ కమిటీ కూడా రష్యన్ ప్లేయర్లు పాల్గొంటున్న టోర్నీల్లో దేశం తరపున ఆడకూడదనే కండిషన్ పెట్టింది. తాజాగా బ్రిటీష్ ప్రభుత్వంలో క్రీడా మంత్రిగా ఉన్న నిగెల్ హడిల్‌స్టన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. ఒకవేళ రష్యన్ ఆటగాళ్లు వింబుల్డన్‌లో పాల్గొనాలనుకుంటే.. రష్యన్ జెండాతో కాకుండా మాములుగా బరిలోకి దిగితే అనుమతిస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. చదవండి: Maria Sharapova Pregnancy: తల్లికాబోతున్న ‘టెన్నిస్ స్టార్’.. సోషల్ మీడియాలో పోస్టుతో The law generally doesn't allow discrimination on the basis of national origin, including Russia, but sports tournaments, like the Boston Marathon & now Wimbledon, can argue they aren't employers or events the public can automatically participate in. We live in interesting times. https://t.co/R1WJl4MzNK — Michael McCann (@McCannSportsLaw) April 20, 2022 -
మెద్వెదేవ్ మెరిసె...
లండన్: ప్రపంచ నంబర్‌వన్ ప్లేయర్ జొకోవిచ్పై... 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన రాఫెల్ నాదల్‌పై తాను సాధించిన విజయాలు గాలివాటమేమీ కాదని రష్యా టెన్నిస్ నయాతార డానిల్ మెద్వెదేవ్ నిరూపించాడు. పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ ఫైనల్స్‌లో 24 ఏళ్ల మెద్వెదేవ్ చాంపియన్‌గా అవతరించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ మెద్వెదేవ్ 4–6, 7–6 (7/2), 6–4తో ప్రపంచ మూడో ర్యాంకర్, ఈ ఏడాది యూఎస్ ఓపెన్ చాంపియన్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)ను ఓడించాడు. ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో ‘బెస్ట్ ఆఫ్ త్రీ సెట్స్’ ప్రవేశపెట్టాక సుదీర్ఘంగా సాగిన ఫైనల్ ఇదే కావడం విశేషం. ఈ ఏడాదితో లండన్‌లో ఏటీపీ ఫైనల్స్ టోర్నీకి తెరపడింది. వచ్చే ఏడాది నుంచి ఇటలీలోని ట్యూరిన్‌లో ఈ మెగా టోర్నీ జరుగుతుంది. ► 2 గంటల 43 నిమిషాలపాటు సాగిన ఈ తుది సమరంలో 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 83 కేజీల బరువున్న మెద్వెదేవ్ 12 ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తొలి సెట్ కోల్పోయి, రెండో సెట్ టైబ్రేక్‌లో 0–2తో వెనుకబడిన మెద్వెదేవ్ వరుసగా ఏడు పాయింట్లు గెలిచి టైబ్రేక్‌ను 7–2తో నెగ్గి రెండో సెట్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో సెట్లో ఐదో గేమ్‌లో థీమ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన మెద్వెదేవ్ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 4–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత కూడా తన సర్వీస్‌లను కాపాడుకున్న ఈ రష్యా ప్లేయర్ చివరకు 6–4తో మూడో సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. దాంతో థీమ్ వరుసగా రెండో ఏడాదీ ఈ టోర్నీలో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ► ఈ టోర్నీలో అజేయంగా నిలిచి టైటిల్ నెగ్గినందుకుగాను మెద్వెదేవ్‌కు 15 లక్షల 64 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 11 కోట్ల 58 లక్షలు)తోపాటు 1500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రన్నరప్‌గా నిలిచిన డొమినిక్ థీమ్‌కు 8 లక్షల 61 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 6 కోట్ల 37 లక్షలు)తోపాటు 800 ర్యాం కింగ్ పాయింట్లు దక్కాయి. ► 50 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో ఏకకాలంలో ప్రపంచ నంబర్‌వన్, నంబర్–2, నంబర్–3 ఆటగాళ్లను ఓడించి విజేతగా నిలిచిన తొలి ప్లేయర్‌గా మెద్వెదేవ్ గుర్తింపు పొందాడు. ఈ టోర్నీలో మెద్వెదేవ్ లీగ్ దశలో వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా)పై, సెమీఫైనల్లో రెండో ర్యాంకర్ రాఫెల్ నాదల్ (స్పెయిన్)పై, ఫైనల్లో మూడో ర్యాంకర్ థీమ్‌పై గెలిచాడు. ► నికొలాయ్ డెవిడెంకో (2009) తర్వాత ఏటీపీ ఫైనల్స్ టైటిల్ నెగ్గిన రెండో రష్యా ప్లేయర్ మెద్వెదేవ్. ► ఓవరాల్‌గా అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ఒకే టోర్నీలో ఏకకాలంలో వరల్డ్ నంబర్‌వన్, నంబర్–2, నంబర్–3 ఆటగాళ్లను ఓడించిన నాలుగో ప్లేయర్ మెద్వెదేవ్. గతంలో నల్బందియాన్ (అర్జెంటీనా–2007 మాడ్రిడ్ ఓపెన్‌లో), జొకోవిచ్ (సెర్బియా–2007 మాంట్రియల్ ఓపెన్‌లో), బోరిస్ బెకర్ (జర్మనీ–1994 స్టాక్‌హోమ్ ఓపెన్‌లో) మాత్రమే ఈ ఘనత సాధించారు. ► ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో వరుసగా ఆరో ఏడాది కొత్త చాంపియన్ అవతరించాడు. ఈ టోర్నీలో ఇలా జరగడం ఇది రెండోసారి. మొదటిసారి 1974 నుంచి 1979 వరకు వరుసగా ఆరేళ్లు కొత్త విజేత వచ్చాడు. ఈ విజయం నాకెంతో ప్రత్యేకం. శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉన్నపుడు నేను ఎంత గొప్ప ఫలితాలు సాధించగలనో ఈ టైటిల్ ద్వారా నిరూపితమైంది. ఈ గెలుపు భవిష్యత్‌లో మరిన్ని మేటి విజయాలకు ప్రేరణగా నిలుస్తుందని నమ్ముతున్నాను. –మెద్వెదేవ్ -
ఆదాయంలో ‘టాప్’
మాస్కో: రష్యా టెన్నిస్ భామ మరియా షరపోవా... అందంతో పాటు ఆదాయంలోనూ ‘టాప్’ అని నిరూపించుకుంది. వరుసగా తొమ్మిదోసారి అత్యధిక సంపాదన కలిగిన మహిళా అథ్లెట్ల జాబితాలో అగ్రస్థానం దక్కించుకుంది. ప్రముఖ పత్రిక ‘ఫోర్బ్స్’ ఈ జాబితాను తయారు చేసింది. జూన్ 2012 నుంచి జూన్ 2013 మధ్య ఏడాది కాలంలో... 26 ఏళ్ల షరపోవా 29 మిలియన్ డాలర్ల (రూ.176 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించింది. ప్రైజ్‌మనీ, వాణిజ్య ప్రకటనల ద్వారా ఈ ఆదాయం సమకూరింది. అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ 20.5 మిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉండగా... నా లీ (చైనా-18.2 మిలియన్ డాలర్లు), విక్టోరియా అజరెంకా (బెలారస్-15.7 మిలియన్ డాలర్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.