మాస్కో: రష్యా టెన్నిస్ భామ మరియా షరపోవా... అందంతో పాటు ఆదాయంలోనూ ‘టాప్’ అని నిరూపించుకుంది. వరుసగా తొమ్మిదోసారి అత్యధిక సంపాదన కలిగిన మహిళా అథ్లెట్ల జాబితాలో అగ్రస్థానం దక్కించుకుంది. ప్రముఖ పత్రిక ‘ఫోర్బ్స్’ ఈ జాబితాను తయారు చేసింది.
జూన్ 2012 నుంచి జూన్ 2013 మధ్య ఏడాది కాలంలో... 26 ఏళ్ల షరపోవా 29 మిలియన్ డాలర్ల (రూ.176 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించింది. ప్రైజ్‌మనీ, వాణిజ్య ప్రకటనల ద్వారా ఈ ఆదాయం సమకూరింది. అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ 20.5 మిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉండగా... నా లీ (చైనా-18.2 మిలియన్ డాలర్లు), విక్టోరియా అజరెంకా (బెలారస్-15.7 మిలియన్ డాలర్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఆదాయంలో ‘టాప్’
Published Wed, Aug 7 2013 2:22 AM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM
Advertisement