హర్షిత రెడ్డికి ‘జాతీయ బాలిక’ అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎస్. హర్షిత రెడ్డికి జాతీయ బాలిక అవార్డు లభించింది. గణిత రంగంలో సాధించిన అసాధారణ విజయానికిగాను ఆమెకు ఈ అవార్డు దక్కింది. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో గురువారం ‘వాత్సల్య మేళా’ కార్యక్రమం నిర్వహించారు.
దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన 22 మంది బాలబాలికలను ఈ కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి కృష్ణాతీరథ్ సత్కరించి పురస్కారాలను అందచేశారు. అవార్డు కింద హర్షిత రెడ్డికి రజత పతకం, రూ.10వేలు, ప్రశంసాపత్రాన్ని అందచేశారు. చెస్‌లో అసమాన ప్రతిభ కనబర్చిన ఢిల్లీకి చెం దిన హర్షల్ షాహీకి స్వర్ణపతకం, రూ.20 వేల నగదు అందచేశారు.