పార్లమెంటరీ కార్యదర్శుల పదవులు రద్దు!
- హైకోర్టు తీర్పు అమలుకు సర్కారు నిర్ణయం
హైదరాబాద్: పార్లమెంటరీ కార్యదర్శులకు సంబంధించి హైకోర్టు తీర్పును అమలు చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. దీంతో ఆరుగురు పార్లమెంటరీ కార్యదర్శులు తమ పదవులు కోల్పోనున్నారు. ఈ నియామకాలు చట్ట ప్రకారం నిబంధనలకు అనుగుణంగా లేవని ఇటీవలే హైకోర్టు తేల్చి చెప్పింది.
పార్లమెంటరీ కార్యదర్శులను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలును నిలిపివేసింది. ఇటీవల ఉన్నతాధికారులు, న్యాయ శాఖతో సంప్రదించిన సీఎం కేసీఆర్ హైకోర్టు తీర్పును అమలు చేస్తూ తదుపరి చర్యలు చేపట్టాలని సూచించినట్లు తెలిసింది.