పార్లమెంటరీ కార్యదర్శుల పదవులు రద్దు! | considering the high court,s order government may cansil parliamentary secretary posts | Sakshi
Sakshi News home page

పార్లమెంటరీ కార్యదర్శుల పదవులు రద్దు!

Published Wed, May 20 2015 1:09 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

considering the high court,s order government may cansil parliamentary secretary posts

- హైకోర్టు తీర్పు అమలుకు సర్కారు నిర్ణయం
 
హైదరాబాద్:
పార్లమెంటరీ కార్యదర్శులకు సంబంధించి హైకోర్టు తీర్పును అమలు చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. దీంతో ఆరుగురు పార్లమెంటరీ కార్యదర్శులు తమ పదవులు కోల్పోనున్నారు. ఈ నియామకాలు చట్ట ప్రకారం నిబంధనలకు అనుగుణంగా లేవని ఇటీవలే హైకోర్టు తేల్చి చెప్పింది.

పార్లమెంటరీ కార్యదర్శులను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలును నిలిపివేసింది. ఇటీవల ఉన్నతాధికారులు, న్యాయ శాఖతో సంప్రదించిన సీఎం కేసీఆర్ హైకోర్టు తీర్పును అమలు చేస్తూ తదుపరి చర్యలు చేపట్టాలని సూచించినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement