SA Shukur
-
హజ్‌యాత్రకు నేటి నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: హజ్‌యాత్ర–2019కు వెళ్లాలనుకునేవారు ఈ నెల 18 నుంచి హజ్ కమిటీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర హజ్‌కమిటీ ప్రత్యేక అధికారి ప్రొఫెసర్ ఎస్ఏ షుకూర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది నుంచి దరఖాస్తుల స్వీకరణతోపాటు అన్ని ప్రక్రియలను ఆన్లైన్ ద్వారా చేపట్టినట్లు పేర్కొన్నారు. నవంబర్ 17వరకు దరఖాస్తు స్వీకరణ ఉంటుందన్నారు. పాస్‌పోర్టు గడువు 2018, నవంబర్ 17కు ముందు నుంచి 2020, జనవరి 31 వరకు ఉండాలన్నారు. దరఖాస్తు చేసుకున్నవారిని డ్రా పద్ధతిలో హజ్‌యాత్రకు ఎంపిక చేస్తారని, డిసెంబర్ చివరివారంలో డ్రా ఉంటుందన్నారు. ఆన్లైన్ దరఖాస్తులకు ఆధార్‌కార్డు తప్పనిసరన్నారు. దరఖాస్తుతోపాటు ఎస్బీఐ ద్వారా రూ.300 చెల్లించాలన్నారు. ఏమైనా సందేహాలుంటే 040 2329 8793 నంబర్ లేదా కేంద్ర హజ్ కమిటీ వెబ్సైట్ www.hajcommittee.gov.inద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. -
2017 హజ్ షెడ్యూల్ విడుదల
► 13 నుంచి తెలంగాణ యాత్రికులు .. 19 నుంచి ఆంధ్రా యాత్రికులు ► హజ్ కమిటీ ప్రత్యేక అధికారి షుకూర్ వెల్లడి సాక్షి,హైదరాబాద్: కేంద్ర హజ్ కమిటీ ఇరు రాష్ట్రాల 2017 హజ్ యాత్రికుల షెడ్యూల్‌ను విడుదల చేసిందని తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్ఏ షుకూర్ తెలిపారు. మంగళవారం హజ్ కమిటీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... ఆగస్టు 13 నుంచి 18 వరకు తెలంగాణ యాత్రికులు, ఆగస్టు 19 నుంచి 22 వరకు ఆంధ్రా యాత్రికులు హజ్ యాత్రకు వెళ్లనున్నట్లు తెలిపారు. నాంపల్లి హజ్‌హౌస్‌లో ఈ నెల 11 నుంచి హజ్ క్యాంప్ ప్రారంభమవుతుందన్నారు. హజ్‌కు ఎంపికైన ఇరు రాష్ట్రాల యాత్రికులకు వారు వెళ్లే తేదీ వారి మొబైల్‌ఫోన్‌కు ఎస్సెమ్మెస్ వస్తుందన్నారు. అలా రానివారు హజ్ కమిటీ కార్యాలయానికి ఫోన్ చేసి కవర్ నంబర్ చెబితే ప్రయాణ తేదీ తెలుస్తుందన్నారు. ప్రయాణ తేదీ నుంచి 48 గంటల ముందు యాత్రికులు హజ్ హౌస్‌లో రిపోర్టు చేయాలని సూచించారు. యాత్రికులు బ్యాంక్‌లో జమ చేసిన ఒరిజినల్ రశీదు, యాత్ర ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని కోరారు. కర్ణాటకలోని నాలుగు జిల్లాలకు చెందిన యాత్రికులతోపాటు..తెలంగాణ, ఆంధ్రా యాత్రికులు కూడా హైదరాబాద్ నుంచే హజ్ యాత్రకు బయల్దేరనున్నట్లు తెలిపారు. -
ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో ఓయూ శతాబ్ది ఉత్సవాలు
సాక్షి సిటీబ్యూరో: ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మైనార్టీ సంక్షేమ శాఖ, ఉర్దూ అకాడమీ సౌజన్యంతో పలు సాంస్కృతికకార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ఉర్దూ అకాడమీ డైరెక్టర్ ఎస్ఎ షుకూర్ తెలిపారు. గురవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉర్దూలో పలు సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు కోసం మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారు ఏకే ఖాన్ అధ్యక్షతన బుధవారం సమావేశం జరిగిందన్నా రు. మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, ఉర్దూ కవులు, రచయితలు పాల్గొన్న ఈ సమావేశంలో ఉర్దూ భాషలో రెండు సెమినార్లు, ముషాయిరాలు, గజల్ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించి నట్టు తెలిపారు. అలాగే వివిధ విభాగాల్లో విశిష్ట సేవలందిస్తున్న ఓయూ పూర్వ విద్యార్థులకు ఉస్మాన్ అలీ పాషా పేరుతో అవార్డులు అందిస్తామన్నారు. రంజాన్‌కు ముందే వీటిని ఇస్తామని ఆయన చెప్పారు. -
హజ్‌యాత్ర దరఖాస్తు గడువు మార్చి 2
సాక్షి, హైదరాబాద్: హజ్ యాత్ర-2015 దరఖాస్తు గడువు ఈ నెల 20తో ముగుస్తుం డగా దీన్ని మార్చి 2 వరకు పొడిగిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేకాధికారి ఎస్.ఎ. షుకూర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారుల రద్దీ కారణంగా గడువు పొడిగించాలని ముంబైలోని కేంద్ర హజ్ కమిటీని కోరడంతో సీహెచ్‌సీ గడువు పొడిగింపునకు అంగీకరిం చిందన్నారు.