ఫైనల్లో సచిన్ సింగ్
న్యూఢిల్లీ: ‘ఐబా’ యూత్ ప్రపంచ చాంపియన్షిప్లో భారత బాక్సర్ సచిన్ సింగ్ (49 కేజీ) ఫైనల్లో ప్రవేశించాడు. దీంతో భారత్కు కనీసం రజతం ఖాయమైంది. శుక్రవారం రష్యాలోని సెరుుంట్ పీటర్స్బర్గ్లో జరిగిన సెమీస్లో ఫిలిప్పీన్సకు చెందిన కార్లో పాలమ్ను 4-1 తేడాతో ఓడించాడు. నేడు (శనివారం) జరిగే ఫైనల్లో సచిన్ క్యూబా బాక్సర్ జోర్గ్ గ్రినన్ను ఎదుర్కొంటాడు. 2010 పోటీల్లో చివరిసారిగా భారత్కు వికాస్ క్రిషన్ స్వర్ణం అందించాడు.