to sack
-
ఐటీ ఉద్యోగులకు దెబ్బ మీద దెబ్బ! మళ్లీ ఇంకో ప్రముఖ కంపెనీ..
Tech layoffs 2024: ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఉద్యోగులకు లేఆఫ్‌లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొత్త సంవత్సరంలోనూ ప్రముఖ కంపెనీలు ఒక దాని వెంట మరొకటి లేఆఫ్‌లను ప్రకటిస్తూనే ఉన్నాయి. యూఎస్‌కు చెందిన క్లౌడ్ ఆధారిత సాఫ్ట్వేర్ కంపెనీ సేల్స్‌ఫోర్స్ దాదాపు 700 మంది ఉద్యోగులను తొలగిస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్ను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది. అమెజాన్, గూగుల్ వంటి టెక్ దిగ్గజాలు ప్రకటించిన లేఆఫ్‌లతో ఇప్పటికే అమెరికాలో తొలగింపుల తరంగం కొనసాగుతుండగా ఇందులో తాజాగా సేల్స్‌ఫోర్స్ చేరింది. సేల్స్‌ఫోర్స్ గత సంవత్సరం 10 శాతం ఉద్యోగాలను తగ్గించింది. కొన్ని కార్యాలయాలను మూసివేసింది. అయితే మార్జిన్లను పెంచడానికి 3,000 మందికి పైగా ఉద్యోగులను తీసుకుంటామని గడిచిన సెప్టెంబరులో కంపెనీ తెలిపింది. వరుస లేఆఫ్‌లు కొత్త ప్రారంభమైనప్పటి నుంచి టెక్ పరిశ్రమలో వరుస లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. Layoffs.fyi పోర్టల్ ప్రకారం.. 2024 ప్రారంభం నుంచి 85 టెక్ కంపెనీలు 23,770 మంది ఉద్యోగులను తొలగించాయి. ఈ వారం మైక్రోసాఫ్ట్ తన గేమింగ్ డివిజన్ యాక్టివిజన్ బ్లిజార్డ్‌లో 1,900 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. అలాగే ఆన్లైన్ రిటైలర్ ఈబే దాదాపు 1,000 మంది ఉద్యోగుల తొలగింపులను కూడా ప్రకటించింది. -
Layoffs 2023: వందలాది మందిని తొలగించనున్న మరో కంపెనీ..
కొత్త సంవత్సరంపై కోటి ఆశలు పెట్టుకున్న ఉద్యోగులకు, ఉద్యోగార్థులకు కంపెనీలు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాయి. ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం సుమారు వెయ్యి మంది ఉద్యోగుల్ని తొలగించినట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే మరో అంతర్జాతీయ కంపెనీ వందలాది మందిని తొలగించనున్నట్లు తెలిపింది. ఇదీ చదవండి: ఇన్ఫోసిస్‌కి భారీ షాక్! రూ.12 వేల కోట్ల డీల్ క్యాన్సిల్ గ్లోబల్ స్పోర్ట్స్ వేర్ దిగ్గజం నైక్.. వ్యయాలను తగ్గించుకునే వ్యూహంలో భాగంగా వందలాది మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళికలను వెల్లడించింది. ‘ది గార్డియన్’ నివేదికల ప్రకారం.. లేఆఫ్‌ల అమలు, కొన్ని సేవలలో ఆటోమేషన్‌ను పెంచడం ద్వారా 2 బిలియన్ డాలర్లు (రూ.16 వేల కోట్లకుపైగా ) ఆదా చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. గత సంవత్సరంలో అమ్మకాలలో తిరోగమనాన్ని ఎదుర్కొన్న నైక్, సంస్థాగత క్రమబద్ధీకరణ అవసరానికి అనుగుణంగా ఈ తొలగింపులు చేపడుతున్నట్లు వెల్లడించింది. తొలగిస్తున్న ఉద్యోగులకు చెల్లించే సీవరెన్స్ ప్యాకేజీల కోసం 450 మిలియన్ డాలర్లు ( సుమారు రూ.3,742 కోట్లు)ను కేటాయించునుంది. కోవిడ్ మహమ్మారి సమయంలో 2020లో 700 మంది ఉద్యోగుల తొలగింపు తర్వాత నైక్ చేపడుతున్న రెండో లేఆఫ్ ఇది. -
ఆదర్శ రైతులకు మంగళం!
ఆంధ్రా బాటలో తెలంగాణ ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆదర్శ రైతుల వ్యవస్థకు మంగళం పాడాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యవస్థ వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో పాటు ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందకపోవడానికి ఆదర్శ రైతులు కారణమవుతున్నారని అధికారుల భావన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రస్తుతం దాదాపు 16 వేల మంది ఆదర్శ రైతులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారికి ప్రతినెలా రూ. వెయ్యి గౌరవ వేతనం ఇస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో వ్యవసాయంలో విశేష అనుభవం ఉన్నవారిని గుర్తించి ప్రతీ గ్రామానికి ఒకరు, పెద్ద గ్రామాలైతే ఇద్దరిని ఆదర్శ రైతులుగా నియమించారు. వ్యవసాయంలో అధునాతన పద్ధతులు, వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులను గ్రామాల్లోని రైతులకు వివరించి, అధిక దిగుబడి సాధించేలా సలహాలు ఇవ్వడం వంటి పనులు వీరు చేస్తున్నారు. కాగా కాంగ్రెస్ కార్యకర్తలనే ఆదర్శ రైతులుగా నియమించుకున్నారని టీఆర్ఎస్ కిందిస్థాయి నేతల నుంచి వస్తున్న ఫిర్యాదులతోపాటు, ఆంధ్రప్రదేశ్‌లో ఈ వ్యవస్థను రద్దు చేసిన నేపథ్యంలో తెలంగాణలోనూ వారిని తొలగించాలని నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు... వ్యవసాయ రంగంలో విస్తరణ కార్యక్రమాలు పూర్తిగా లేకుండా పోయాయని, రైతులకు ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించే వారు లేకుండా పోయారని తెలంగాణ సీఎం కొద్దిరోజులుగా పేర్కొంటూ వస్తున్నారు. అలాంటిది ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయకుండా ఉన్న వ్యవస్థను తొలగించడం వల్ల రైతులు మరింత ఇబ్బందులు పడే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు ఆదర్శ రైతుల వ్యవస్థతో పెద్దగా ప్రయోజనం లేదని అధికారవర్గాలు వ్యాఖ్యానించడం గమనార్హం.