రైస్ మిల్లులో అగ్నిప్రమాదం
కరీంనగర్: కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం సదాశివపల్లి గ్రామంలోని రైస్ మిల్లులో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. రైస్ మిల్లు సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
దీంతో అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో సహ ఘటన స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. ఈ ప్రమాదంలో మిల్లులోని ధాన్యం, గన్నీ బ్యాగులు అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు రూ. 50 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించిందని అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.