రాఖీ సందడి
సదాశివపేట/సిద్దిపేట టౌన్: రక్షాబంధన్ వేడుకలను పురస్కరించుకుని జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో పండుగ సందడి కనిపించింది. ఆయా చోట్ల వెలిసిన దుకాణాల్లో రాఖీల ను కొనుగోలు చేసేందుకు మహిళలు, యువతులు బారులుతీరారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ఆత్మీయ అనురాగాలకు చిహ్నంగా జరుపుకునే సంబరాలను వైభవంగా నిర్వహించుకునేందుకు ప్రజలంతా సిద్ధమవుతున్నారు. రూ.1 నుంచి రూ.150 వరకు మార్కెట్లలో అందుబాటులో ఉన్న రాఖీలను కొనుగోలు చేస్తున్నారు.
సిద్దిపేటలోని సుభాష్‌రోడ్, బస్టాండ్, మెదక్ రోడ్, మెయిన్‌రోడ్, కాంచీట్ చౌరస్తా, కరీంనగర్ రహదారి పక్కన వందలాది రాఖీల దుకాణాలు వెలిశాయి. 50 పైసల నుంచి రూ. 500ల ఖరీదైన రాఖీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో విక్రయానికి పెట్టారు. రాఖీలు దుకాణాలు, స్వీట్ దుకాణాలు కొనుగోలుదారులతో సందడి గా మారాయి. ఆదివారం పండుగ నిర్వహ ణకు వివిధ సంఘాలు ఏర్పాట్లు చేశాయి.