ఎల్లోరా గుహలను ఆన్లైన్లో చూడచ్చు...
ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు భారతీయ చరిత్ర, సంస్కృతికి సంబంధించిన 1400 కళాకృతులను ఆన్లైన్లో వీక్షించనున్నారు. అలాగే సఫ్దర్జంగ్ సమాధులు, ఎల్లోరా గుహలు, పురాణ క్వీలా వంటి చారిత్రక ప్రాంతాలను గూగుల్ సాంస్కృతిక ఇన్స్టిట్యూట్ (జీసీఐ) వెబ్సైట్లో తిలకించవచ్చు. ఈ మేరకు చారిత్రక ఔన్నత్యం కలిగిన 76 ప్రాంతాలకు సంబంధించి 360 డిగ్రీల కోణంలో చూడగలిగే ఛాయచిత్రాలను విడుదల చేస్తున్నట్టు ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ఓ ప్రకటనలో తెలిపింది.
భారత ఆర్కియాలజీకల్ సర్వే (ఏఎస్ఐ) సహకారంతో వీటిని జీసీఐ సైట్లో అప్లోడ్ చేసినట్టు వివరించింది. స్టీట్ వ్యూ టెక్నాలజీ సాయంతో ఈ చారిత్రక ప్రదేశాలను విహంగ విక్షణం చేసే అవకాశం కల్పించింది. దీంతో ఆన్లైన్లో చేరిన ఏఎస్ఐ ఆధ్వర్యంలోని చారిత్రక ప్రదేశాల సంఖ్య వందకు చేరింది. తాజ్మహల్, హుమాయున్ సమాధులు వంటి చారిత్రక ప్రదేశాలను ఇప్పటికే ఆన్లైన్లో వీక్షించవచ్చు.