కోర్టుకు హాజరైన ఎమ్మెల్యేలు
మెదక్(సంగారెడ్డి): ఎంఐఎం ఎమ్మెల్యేలు బుధవారం మెదక్ జిల్లా సంగారెడ్డిలోని జిల్లా కోర్టుకు హాజరయ్యారు. పటాన్చెరు మండలం ముత్తంగి వద్ద అప్పట్లో మజీద్ తొలగింపు విషయంలో అప్పటి కలెక్టర్ ఏకే సింఘాల్‌ను దూషించిన కేసులో ఎంఐఎం నేతలు అక్బరుద్దీన్ ఒవైసీ, అహ్మద్‌పాషా ఖాద్రీ, ముంతాజ్‌ఖాన్‌లు నిందితులుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మెజిస్ట్రేట్ వెంకట్రాం ఎదుట వీరు హాజరయ్యారు. మెజిస్ట్రేట్ ఈ కేసును ఈనెల 24కు వాయిదా వేశారు. ఎంఐఎం నేతలు వస్తున్నారని తెలుసుకున్న ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కోర్టు ఆవరణకు చేరుకున్నారు.