Sahara assets
-
127 ట్రక్కుల్లో 3 కోట్ల పత్రాలు.. సెబీకి పంపిన సుబ్రతా రాయ్.. కారణం ఇదేనా?
సహారా గ్రూప్ ఛైర్మన్ సుబ్రతా రాయ్ అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. ఆయన మరణం దాదాపు మూడు కోట్ల మంది పెట్టుబడిదారులు చేసిన మదుపుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. సహారా ఇండియా గ్రూప్ సంస్థ వెబ్సైట్ ప్రకారం.. ఈ సంస్థకు 9 కోట్ల మంది పెట్టుబడిదారులు, వినియోగదారులు ఉన్నారు. రూ.2.59 లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. వేల క్యాంపస్‌లు, 30,970 ఎకరాల భూములు ఉన్నట్లు సహారా ఇండియా వెబ్సైట్ చెబుతోంది. సెబీ చర్యల కారణంగా సుబ్రతా రాయ్ నిర్మించుకున్న సామ్రాజ్యం పతనం అవడం మొదలైంది. సహారా సంస్థ రియల్ఎస్టేట్ పెట్టుబడుల కోసమంటూ మూడు కోట్ల మందికి పైగా పెట్టుబడిదారుల నుంచి సుమారు రూ.25వేల కోట్ల రూపాయలను సమీకరించడంపై కేసు నమోదైంది. 2011లో ఇన్వెస్టర్ల డబ్బును తిరిగి చెల్లించాలని సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎస్‌ఐఆర్‌ఈఎల్), సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎస్‌హెచ్‌ఐసీఎల్) అనే రెండు సంస్థలను సెబీ ఆదేశించింది. అందుకు సంబంధించిన వివరాలు అడిగిన నేపథ్యంలో సహారా గ్రూప్ నుంచి 127 ట్రక్కులను సెబీ కార్యాలయానికి పంపి సుబ్రతా రాయ్ వార్తల్లో నిలిచారు. ఆ ట్రక్కుల్లో మూడు కోట్ల దరఖాస్తు పత్రాలు, రెండు కోట్ల రిడంప్షన్ ఓచర్లు ఉన్నాయి. నిర్ణత గడువులోగా రూ.10 వేల కోట్ల బకాయిలు చెల్లించకపోతే 2014 మార్చి 4న సుబ్రతా రాయ్ జైలుకి వెళ్లారు. రూ.5 వేల కోట్లు నగదు రూపంలో, మిగతా రూ.5 వేల కోట్లు బ్యాంకు గ్యారంటీ రూపంలో హామీ ఇస్తేనే ఆయన విడుదల సాధ్యమవుతుందని కోర్టు స్పష్టం చేసింది. రాయ్ రెండేళ్ల జైలు జీవితం అనంతరం పెరోల్‌పై విడుదలయ్యారు. ఇదీ చదవండి: ‘ఎక్స్’ సమాచారాన్ని నమ్మలేం.. జిమ్మీ వేల్స్ ఆసక్తికర వ్యాఖ్యలు సెబీకు దాదాపు రూ.25వేల కోట్లు డిపాజిట్ చేసినట్లు గతంలో సుబ్రతారాయ్ ప్రకటించారు. కానీ కంపెనీ పెట్టుబడిదారులకు సెబీ తిరిగి సొమ్ము చెల్లించలేదని రాయ్ ఆరోపించారు. సెబీ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2023 మార్చి 31 నాటికి పెట్టుబడిదారులకు ఇచ్చేందుకు మొత్తం రూ.25,163 కోట్లు నిర్ణయించినప్పటికీ రూ.138 కోట్లు మాత్రమే తిరిగి చెల్లించింది. రెండు సహారా గ్రూపు సంస్థలు ఇన్వెస్టర్ల నుంచి భారీగా డబ్బు సేకరించేటప్పుడు వివిధ నిబంధనలను ఉల్లంఘించారు. మార్చి 31 నాటికి తమకు 20వేల కంటే తక్కువ దరఖాస్తులు వచ్చాయి. 17500 దరఖాస్తులకు సంబంధించిన డబ్బును వాపసు చేశామని సెబీ తెలిపింది. సరైన రుజువులు సమర్పించని కారణంగా మిగతావాటిని చెల్లించలేదని వివరించింది. సెబీ లేవనెత్తిన ప్రశ్నలపై బాండ్ హోల్డర్ల నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాకపోవడంతో వాటిని నిలిపేసినట్లు సమాచారం. -
సహారా ఆస్తుల్లోమరికొన్ని వేలానికి..
♦ 42కు చేరిన మొత్తం స్థలాల సంఖ్య ♦ రిజర్వ్ ధర రూ.4,345 కోట్లు ♦ జాబితాలో ఇంకా 20 భూములు... న్యూఢిల్లీ: వేలం ప్రక్రియకు సంబంధించి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ జాబితాలో మరో పదహారు సహారా ఆస్తులు చేరాయి. వీటి బిడ్ ధరను రూ.1,245 కోట్లుగా నిర్ణయించింది. దీనితో వేలానికి సిద్ధమయిన మొత్తం భూముల సంఖ్య 42కు చేరింది. వీటి మొత్తం రిజర్వ్ ధర రూ.4,345 కోట్లకు చేరింది. రానున్న రోజుల్లో ఇంతే విలువైన ఆస్తులు వేలం జాబితాలో చేరే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి. సెబీ గురువారం రెండు వేర్వేరు నోటీసులు విడుదల చేస్తూ... జూలై 20వ తేదీన రూ.666 కోట్ల రిజర్వ్ ధరతో ఎస్బీఐ క్యాప్స్ ఎనిమిది ఆస్తుల ఈ-వేలం నిర్వహిస్తుందని పేర్కొంది. రూ.579 కోట్ల విలువైన మరో ఎనిమిది ఆస్తులను జూలై 18న హెచ్డీఎఫ్సీ ఈ-వేలం వేస్తుందని పేర్కొంది. జూలై 7, జూలై 13వ తేదీల్లో ఎస్బీఐ క్యాప్స్ మరికొన్ని భూములను ఈ ఆక్షన్ నిర్వహిస్తుండగా, జూలై 4, జూలై 15 తేదీల్లో హెచ్డీఎఫ్సీ రియల్టీ కొన్ని భూములకు వేలం నిర్వహించనున్నాయి. ఇరు సంస్థలు సమానంగా మొత్తం 26 ఆస్తులకు ఈ వేలం నిర్వహించనున్నాయి. రిజర్వ్ ధర రూ.3,100 కోట్లు. తరువాత మిగిలిన ఆస్తుల వేలం... 31 ల్యాండ్ పార్శిళ్లను రూ.2,400 కోట్లకు విక్రయించడానికి హెచ్డీఎఫ్సీ రియల్టీకి సెబీ అనుమతి ఉంది. ఇక ఎస్బీఐ క్యాప్ విషయంలో 30 ల్యాండ్ ప్రొపర్టీల అమ్మకాలకు అనుమతి ఉంది. దేశ వ్యాప్తంగా ఈ ఆస్తులు ఉన్నాయి. మిగిలిన ఆస్తుల ఈ- విక్రయానికి మరోసారి నోటీసులు వెలువడనున్నాయి. ఈ కేసులో రెండేళ్ల పాటు తీహార్ జైలులో ఉన్న సహారా చీఫ్ సుబ్రతారాయ్ ప్రస్తుతం పెరోల్‌పై ఉన్నారు. -
ఆన్లైన్ ద్వారా సహారా ఆస్తుల వేలం!
♦ రిజర్వ్ ధర రూ.1,200 కోట్లు ♦ ఆక్షన్ ప్రక్రియకు హెచ్డీఎఫ్సీ రియల్టీ, ♦ ఎస్బీఐ క్యాపిటల్ శ్రీకారం న్యూఢిల్లీ: సహారా ఆస్తుల అమ్మకానికి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నియమించుకున్న హెచ్డీఎఫ్సీ రియల్టీ, ఎస్బీఐ క్యాపిటల్ తమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఈ-వేలం ద్వారా కంపెనీకి చెందిన ఆస్తులను అమ్మనున్నాయి. ఇందుకు దాదాపు రూ.1,200 కోట్ల రిజర్వ్ ధరను నిర్ణయించాయి. 31 ల్యాండ్ పార్శిళ్లను రూ.2,400 కోట్లకు విక్రయించడానికి హెచ్డీఎఫ్సీ రియల్టీకి సెబీ అనుమతి ఉంది. ఇక ఎస్బీఐ క్యాప్ విషయంలో 30 ల్యాండ్ ప్రొపర్టీల అమ్మకాలకు అనుమతి ఉంది. వీటి మార్కెట్ విలువ దాదాపు రూ.4,100 కోట్లు. సహారా ఆస్తుల అమ్మకానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇందుకుగాను సెబీ హెచ్డీఎఫ్సీ రియల్టీ, ఎస్బీఐ క్యాపిటల్ సహాయాన్ని తీసుకుంటున్న సంగతి తెలిసిందే. హెచ్డీఎఫ్సీ పబ్లిక్ నోటీస్..: దీని ప్రకారం... జూలై 4 వ తేదీ ఉదయం 11 గంటల నుంచీ 12 గంటల వరకూ గంటపాటు నాలుగు ల్యాండ్ పార్మిళ్లకు సంబంధించి ఈ-ఆక్షన్‌ను నిర్వహించనుంది. రిజర్వ్ ధర రూ.722 కోట్లు. ఎస్బీఐ క్యాప్ విషయానికి వస్తే..: జూలై 7న ఉదయం 10.30 నుంచి 11.30 వరకూ ఐదు ల్యాండ్ పార్శిల్స్‌కు సంబంధించి ఈ-ఆక్షన్ జరుగుతుంది. రిజర్వ్ ధర రూ.470 కోట్లు. ఈ ఆస్తులు ఎక్కడ ఉన్నాయి..: ఆక్షన్ పరిధిలో ఉన్న భూములు ఆంధ్రప్రదేశ్‌సహా తమిళనాడు, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లలో ఉన్నాయి. వీటిలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములున్నట్లు సమాచారం. బిడ్డింగ్‌లో పాల్గొనాలనుకునే బిడ్డర్లు జూన్ 8 నుంచి జూన్ 10 రోజుల్లో ఆస్తులను పరిశీలించుకోడానికి సమయాన్ని కేటాయించడం జరిగింది.