Sahara hotels
-
ఫ్యాషన్ డిజైనర్ మనాలి జగ్తాప్ ఆఫ్ క్యాన్సర్ సర్వైవర్
ఫ్యాషన్ డిజైనర్ మనాలి జగ్తాప్ ఆఫ్ క్యాన్సర్ సర్వైవర్. ముంబైలో క్యాన్సర్‌కి చికిత్స తీసుకుంటూ కూడా డ్రెస్ డిజైనర్‌గా కొనసాగింది. ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తూ, అవార్డులూ పొందుతోంది. ‘సంతోషంగా ఉండటం వల్లే వ్యాధిని ఓడించగలుగుతున్నాను’ అంటోంది మనాలి. ముంబయికి చెందిన ఫ్యాషన్ డిజైనర్ మనాలి కిందటి సంవత్సరం క్యాన్సర్ చికిత్సలో భాగంగా 12 కెమోథెరపీలు చేయించుకున్నది. ఇప్పుడు ఆమె మరోసారి తన డిజైనింగ్ నైపుణ్యంతో ప్రజలను ప్రభావితం చేస్తోంది. క్యాన్సర్ రోగులందరికీ జీవితాన్ని వదులుకోకుండా ముందుకు సాగాలని మనాలి తన జీవితం ద్వారా నిరూపిస్తోంది. 2018 ఏప్రిల్‌లో తన గర్భాశయంలో ఏదో తేడా ఉందని మనాలికి అర్ధమైంది. ఈ కారణంగానే ప్రతి నెలా భారీగా రక్తస్రావం జరిగేది. ఆపరేషన్ చేసి, తన గర్భాశయాన్ని తొలగించాలని ఆమె డాక్టర్ని కోరింది. దీంట్లో భాగంగా బయాప్సీ టెస్ట్ చేయడంతో ఆమెకు క్యాన్సర్ ఉందని తేలింది. క్లినికల్ భాషలో, దీనిని ఎండోమెట్రియల్ స్ట్రోమల్ సార్కోమా అంటారు. ప్రతిరోజూ సంతోషంగా.. మనాలికి క్యాన్సర్ ఉందని కుటుంబంలో అందరూ భయపడ్డారు. అదే సమయంలో, ఆమె ఫ్యాషన్ షో కోసం దుబాయ్ వెళ్లాల్సి ఉంది. ఆమె తల్లిదండ్రులు మనాలికి క్యాన్సర్ అనే విషయం ఆమెకు చెప్పకుండా దాచారు. కాని, వారి విచారకరమైన ముఖాలను చూడటంతో ఆమెకు తన స్థితిని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. గతంలో మనాలి కుటుంబంలో ఎవరికీ క్యాన్సర్ లేదు. అందుకే, అది క్యాన్సర్‌కు దారి తీస్తుందని వారూ గుర్తించలేదు. తన చావో బతుకో ఏదైనా జరగవచ్చని మనాలికి తెలుసు. దీంతో బతికి ఉన్నన్నాళ్లూ తన కుటుంబంతో సంతోషంగా ఉంటూ జీవితాన్ని ఆస్వాదించాలనుకుంది. భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా, ప్రతిరోజూ సంతోషంగా గడపాలని కోరుకుంది. ఈ అనారోగ్యం సమయంలో కూడా మనాలి తన ఆలోచనను సానుకూలంగా మార్చుకుంది. ముంబయ్‌లోని సహారా స్టార్ హోటల్లో ఇటీవల జరిగిన లోక్మత్ లైఫ్‌స్టైల్ ఐకాన్ 2020 అవార్డు వేడుకలో ఫ్యాషన్ డిజైనర్ ఐకాన్ 2020 అవార్డును అందుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన మనాలి..‘కుటుంబం, స్నేహితులే నా బలం. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా క్యాన్సర్ నెమ్మదిగా చంపేస్తుంది. జుట్టు పోతుంది, అందం తగ్గుతుంది. అన్నీ తెలుసు. కానీ, మన కల మనల్ని బతికించాలి. లక్ష్యం వైపుగా ప్రయత్నించాలి అనుకున్నాను. అప్పుడే నన్ను నేను మార్చుకోవాలనుకున్నాను. విగ్గు పెట్టుకుంటాను, డిజైనర్ డ్రెస్సులు ధరిస్తాను. అలాగే సంతోషంగా నా జీవితాన్ని తిరిగి మొదలుపెట్టాను. ఇప్పుడు సమస్య లేదని అనను. కానీ, డిజైనర్‌గా నా పనిని నేను కొనసాగిస్తూనే ఉంటాను. ఫ్యాషన్ షోలలో పాల్గొంటాను. కెరియర్లో ఎదుగుతాను. మూడేళ్లుగా నా పనుల్లో ఎక్కడా అంతరాయం రాకుండా చూసుకున్నాను. క్యాన్సర్ పేషంట్స్‌కు రోగం పట్ల అవగాహన కల్గిస్తూ మరింత సంతృప్తిగా జీవిస్తాను’ అని తెలిపారు మనాలి. క్యాన్సర్ అనగానే బతుకు భయంతో కుంగిపాటుకు లోనయ్యేవారికి మనాలి చెప్పే మాటలు ఉత్తేజాన్ని నింపుతాయి. ఆమె జీవితం ఒక ప్రేరణగా నిలుస్తుంది. క్యాన్సర్ చికిత్స సమయంలో..; ఫ్యాషన్ డిజైనర్‌గా అవార్డు అందుకుంటూ.. -
సహారా హోటల్స్ డీల్‌లో లలిత్‌మోదీ పేరు
- సుప్రీంకోర్టు ముందు వివరాలు తెలిపిన - అమెరికా ఇన్వెస్ట్మెంట్ సంస్థ తరఫు న్యాయవాది.. న్యూఢిల్లీ: లండన్, న్యూయార్క్ల్లోని సహారా హోటల్స్ అమ్మకాల వ్యవహారంలో ‘తీవ్ర రాజకీయ వివాదంలో’ ఉన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాజీ చీఫ్ లలిత్ మోదీ పేరు తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... సహారాకు లండన్‌లో గ్రోస్వీనార్ హౌస్ హోటల్, న్యూయార్క్‌లో న్యూయార్క్ ప్లాజా, డ్రీమ్ న్యూయార్క్ హోటల్స్ ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు సంవత్సన్నర కాలంలో తీహార్ జైలులో ఉంటున్న సహారా చీఫ్ సుబ్రతోరాయ్ బెయిల్‌పై విడుదలకు, రూ.10,000 కోట్లను సమీకరించడంలో భాగంగా ఈ హోటళ్ల విక్రయ ప్రతిపాదనలపై కసరత్తు జరుగుతోంది. ఈ హోటళ్లను తాము కొనుగోలు చేస్తామని విన్నవిస్తూ... బ్రిటన్‌కు చెందిన కేన్ కేపిటల్ పార్ట్నర్స్ లిమిటెడ్, అమెరికాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ మిడ్‌సన్ కేపిటల్ హోల్డింగ్ ఎల్ఎల్సీలు అత్యున్నత న్యాయస్థానంలో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిని సుప్రీంకోర్టు సోమవారం విచారణకు చేపట్టింది. మిడ్‌సన్ కేపిటల్ తరఫున వివరాలను కోర్టుకు తెలుపుతున్న న్యాయవాది... ఈ సందర్భంగా లలిత్ మోదీ పేరును జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ ముందు ప్రస్తావించారు. సుబ్రతోరాయ్ కుమారుడు శుశాంతో రాయ్ విదేశీ హోటళ్ల విక్రయానికి సంబంధించి లలిత్ మోదీ సహాయాన్ని కోరినట్లు తెలిపారు. సహారా తరఫున మోదీనే డీల్ వ్యవహారాలు చూస్తున్నారని సైతం సూచించారు. తన క్లెయింట్ న్యూయార్క్‌లో హోటళ్ల కొనుగోలుకు 800 మిలియన్ డాలర్లను ఆఫర్ చేస్తూ... మోదీకి ఒక లేఖ రాశారని పేర్కొన్నాయి. అయితే మోదీ దీనికి ఒక మెయిల్లో జవాబిస్తూ... గ్రూప్ ఆఫర్ 965 మిలియన్ డాలర్లుగా ఉందని తెలియజేశారని, ఈ మెయిల్ శుశాంతోకు కూడా మార్క్ చేసి ఉందని విన్నవించారు. కాగా బ్రిటన్ హోటల్ కొనుగోలుకు ముందుకు వచ్చిన కేన్ కేపిటల్ పార్ట్నర్స్ ఈ డీల్‌కు సంబంధించి 637 మిలియన్ పౌండ్లను ఆఫర్ చేసింది. పూర్తిగా హోటళ్లను అమ్మబోం: సహారా ఈ ఆఫర్లను మీ క్లయింట్ ఆమోదిస్తున్నారా! అని ఈ సందర్భంగా సహారా తరఫు వాదనలు వినిపిస్తున్న కపిల్ సిబల్‌ను బెంచ్ ప్రశ్నించింది. ఈ సందర్భంగా సిబల్ సమాధానం చెబుతూ, హోటళ్లను పూర్తిగా అమ్మదలచుకోవడంలేదని తెలిపారు. మరింత అధిక మొత్తంతో మరో రెండు కొత్త ఆఫర్లు సైతం పెండింగులో ఉన్నట్లు తెలిపారు. కొన్ని సంస్థలు హోటళ్లను దురాక్రమణ చేయాలని భావిస్తున్నట్లు కూడా సహారా తరఫున సిబల్ కోర్టుకు ఈ సందర్భంగా తెలిపారు. హోటళ్ల విక్రయ ప్రతిపాదనల పురోగతి, చైనా బ్యాంక్‌తో రుణ లావాదేవీల అంశాలను ఎప్పటికప్పుడు అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేయాలని ధర్మస్థానం ఆదేశించింది. కాగా ఆస్తుల విక్రయానికి సంబంధించి తీహార్ జైలు కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేక సదుపాయాలను సహారా చీఫ్‌కు పొడిగించాలన్న కపిల్‌సిబల్ విజ్ఞప్తిని కోర్టు ఆమోదించింది. కేసు తదుపరి విచారణ వచ్చేనెల 14కు వాయిదా పడింది.