sahithya academy
-
Sahitya Akademi Awards 2023: 24 మందికి సాహిత్య అకాడమీ పురస్కారాలు
న్యూఢిల్లీ: ఆంగ్ల రచయిత్రి నీలం సరణ్ గౌర్, హిందీ నవలా రచయిత సంజీవ్‌సహా 25 మంది రచయితలు 2023 సంవత్సరానికి సాహిత్య అకాడమీ అవార్డులు అందుకున్నారు. మాధవ్ కౌశిక్ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో భేటీ అయిన అకాడమీ ఎగ్జిక్యూటివ్ బోర్డు 24 భారతీయ భాషలకుగాను జ్యూరీ సభ్యులు సూచించిన పేర్లకు ఆమోదం తెలిపిందని సాహిత్య అకాడమీ ఒక ప్రకటనలో పేర్కొంది. తొమ్మిది కవితా సంపుటాలు, ఆరు నవలలు, ఐదు చిన్న కథల సంపుటాలు, మూడు వ్యాసాలు, ఒక సాహిత్య అధ్యయనానికి ఈ అవార్డులు దక్కాయి. ముఝే పెహ్చానో నవలకుగాను సంజీవ్‌కు, రెకియమ్ ఇన్ రాగా జానకి పుస్తకానికిగాను నీలం సరణ్ గౌర్‌కు అవార్డు దక్కింది. టి.పతంజలి శా్రస్తి(తెలుగు), విజయ్ వర్మ(డోగ్రీ), వినోద్ జోషి(గుజరాతీ), బన్సూర్ బనిహరి(కశీ్మరీ), అరుణ్ రంజన్ మిశ్రా(సంస్కృతం) తదితరులు అవార్డులు పొందిన వారిలో ఉన్నారు. -
రారండోయ్
‘హైదరాబాద్ ఫెస్ట్ 2018(పుస్తక ప్రదర్శన) తెలంగాణ కళాభారతి(ఎన్టీఆర్ స్టేడియం) లో ఏప్రిల్ 13 నుంచి 22 వరకు జరగనుంది. తెలంగాణ సాహిత్య అకాడమి నెలనెలా ‘కావ్య పరిమళం’ శీర్షిక క్రమంలో ఏప్రిల్ 13న సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్లో పాల్కురికి సోమనాథుని బసవ పురాణంపై డాక్టర్ అనుమాండ్ల భూమయ్య ప్రసంగిస్తారు. అధ్యక్షుడు నందిని సిధారెడ్డి. తంగెళ్లపల్లి కనకాచారి కవితా సంకలనం ‘కుదుపు’ ఆవిష్కరణ ఏప్రిల్ 15న ఉదయం 10 గంటలకు వట్టికోట ఆళ్వారుస్వామి నగర కేంద్ర గ్రంథాలయం, చిక్కడపల్లిలో జరగనుంది. పాలమూరు సాహితీ అవార్డు కోసం 2017లో వచ్చిన వచన కవితా సంపుటాల మూడేసి ప్రతులను ఏప్రిల్ 30 లోగా పంపాలని నిర్వాహకులు కోరుతున్నారు. చిరునామా: డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, 8–5–38, టీచర్స్ కాలనీ, మహబూబ్‌నగర్–509001. వివరాలకు: 9032844017 ‘సోమనాథ కళా పీఠం’ 2018 ద్వైవార్షిక పురస్కారాలకుగానూ ఏప్రిల్ 30లోగా ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నారు. పాలకురికి సోమనాథుని జీవిత సాహిత్యాలపై పరిశోధన చేసినవారు ‘సోమనాథ సాహిత్య పురస్కారం’, సోమనాథుని భావజాలంపై కృషి చేసినవారు ‘సోమనాథ సామాజిక శోధన పురస్కారం’, నాటక రంగమున సాధన చేసినవారు ‘సోమనాథ రంగస్థల పురస్కారం’, తెలుగు భాషా సాహిత్యములకు సేవ చేసినవారు ‘పందిళ్ల శేఖర్ బాబు రాజయ్య శాస్త్రి స్మారక పురస్కారం’, సాహిత్య రసాస్వాదనకు కృషి చేస్తున్న కోవిదులు ‘వి.చలపతి రావు స్మారక పురస్కారం’ కోసం ‘డాక్టర్ రాపోలు సత్యనారాయణ, గౌరవ అధ్యక్షుడు, సోమనాథ కళాపీఠం, పాలకుర్తి – 506146, జనగామ, ఫోన్: 9440163211’ చిరునామాకు పంపవచ్చు. -
ఈ రీడింగ్ ఈజీ రీడింగ్
గెస్ట్ కాలమ్ కారా మాస్టారిని అడిగాను, ‘చదవగలుగుతున్నారా’ అని. ‘ఇది వరకటిలాగా ఏకధాటిగా చదవలేకపోతున్నాను. మధ్య మధ్య ఆపి కళ్లకు కాస్త విశ్రాంతినిస్తూ చదువుతూనే ఉన్నాను’ అన్నారు. అప్పటికి ఆయనకు 86 ఏళ్లు! చదవడం మీదున్న ప్రేమ అది. ‘నా దస్తూరి అర్థం కాక పొరపాటున మరో పదం కంపోజ్ అయి అదే ప్రింటవుతోంది. ఇక నా రచనలను నేనే తెలుగులో టైప్ చేసుకోవాలి’ షాడో సృష్టికర్త మధుబాబు అభిప్రాయం. ఆ మధ్య అమెరికాలో తెలుగు పుస్తకావిష్కరణ కార్యక్రమం. ఆవిష్కరణ తేదీ దగ్గర పడుతున్నప్పటికీ హైదరాబాద్‌లో అచ్చు అయి అమెరికా చేరాల్సిన పుస్తకాలు చేరనేలేదు. వెంటనే ‘ప్రింట్ ఆన్ డిమాండ్’ సాంకేతిక పరిజ్ఞానంతో అక్కడే తెలుగుపుస్తకాలను అచ్చు వేయించి ఆవిష్కరణ సభని నిర్విఘ్నంగా, విజయవంతంగా నిర్వహించుకున్నారు. కేంద్ర సాహిత్య అకాడమి వంటి ప్రచురణ సంస్థలు కూడా రచయితలు తమకు పంపే రచనలను సాఫ్ట్ కాపీలుగా పంపమని కోరుతున్నాయి. ఆదిలాబాదులో ఈ రోజు రాసిన కథని ఆన్లైన్లో తన లాప్టాప్ నుంచి ఈ- పబ్లిష్ చేసుకుంటున్నారు తెలుగు రచయిత. ఇది ఈ రోజు రచనావ్యాసంగంలో తెలుగు రచయితలుయ వారి రచనలు, ప్రచురణల పురోగతి. ఒకప్పుడు ప్రవాసాంధ్ర పాఠకులు కోఠీ, కాచిగూడ, వైజాగ్ గుప్తా బ్రదర్స్, విజయవాడ ఏలూరు రోడ్డు, చెన్నై పాండిబజార్లోని రాణి బుక్ సెంటర్లలో తెలుగు పుస్తకాలు కొనుక్కుని విమానం ఎక్కేవారు. ఇల్లినాయిస్లో ఉంటున్న అన్నయ్య... తమ్ముడికి కావల్సిన పుస్తకాన్ని ఆన్లైన్లో కొని ఈమెయిల్ చేస్తున్నాడు. ఆదిలాబాద్‌లోని తమ్ముడు డౌన్లోడ్ చేసుకుంటున్నాడు. ఇంటర్నెట్ పుణ్యమా అని పుస్తకాల కోసం ఇది వరకటిలాగ గంటలసేపు ప్రయాణాలు, రోజుల తరబడి నిరీక్షణలు లేవు. సాంకేతిక ప్రగతి విద్యుత్ స్తంభాల చెయ్యిపట్టుకుని గ్రామాలకు వ్యాపిస్తోంది. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్, టెలివిజన్ పరస్పర కరచాలనం చేసుకుంటూ చదువుని ఒక అద్భుతమైన దృష్ణికోణం నుంచి ఆవిష్కరిస్తున్నాయి. పుస్తకాన్ని చేతిలో పట్టుకుని చదివితే చదివినట్లు అనే ధోరణిలో మార్పు వచ్చేసింది. - అనిల్ అట్లూరి, కినిగె డాట్‌కామ్ నిర్వహకులు వేనవేల ఘనపు చదరపు అడుగులలో నిర్మించిన పుస్తకభాండాగారాలలోని లక్షల పుస్తకాలు ఈ రోజు పాఠకుడి డెస్క్‌టాప్‌లోకి వచ్చేశాయి. పురాణాలు, ఇతిహాసాల నుంచి నేటి తెలుగు హైకూల వరకు... చదువుకున్న వారికి చదువుకున్నంత. అయితే పాఠకుడు చదవడం కోసం వెచ్చించే సమయం తగ్గింది. వెయ్యి పేజీల నవల రెండు వందల పేజీలకు కుచించుకుపోయింది. నవలికలు, కథలు పెరిగాయి.