
న్యూఢిల్లీ: ఆంగ్ల రచయిత్రి నీలం సరణ్ గౌర్, హిందీ నవలా రచయిత సంజీవ్‌సహా 25 మంది రచయితలు 2023 సంవత్సరానికి సాహిత్య అకాడమీ అవార్డులు అందుకున్నారు. మాధవ్ కౌశిక్ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో భేటీ అయిన అకాడమీ ఎగ్జిక్యూటివ్ బోర్డు 24 భారతీయ భాషలకుగాను జ్యూరీ సభ్యులు సూచించిన పేర్లకు ఆమోదం తెలిపిందని సాహిత్య అకాడమీ ఒక ప్రకటనలో పేర్కొంది.
తొమ్మిది కవితా సంపుటాలు, ఆరు నవలలు, ఐదు చిన్న కథల సంపుటాలు, మూడు వ్యాసాలు, ఒక సాహిత్య అధ్యయనానికి ఈ అవార్డులు దక్కాయి. ముఝే పెహ్‌చానో నవలకుగాను సంజీవ్‌కు, రెకియమ్ ఇన్ రాగా జానకి పుస్తకానికిగాను నీలం సరణ్ గౌర్‌కు అవార్డు దక్కింది. టి.పతంజలి శా్రస్తి(తెలుగు), విజయ్ వర్మ(డోగ్రీ), వినోద్ జోషి(గుజరాతీ), బన్సూర్ బనిహరి(కశీ్మరీ), అరుణ్ రంజన్ మిశ్రా(సంస్కృతం) తదితరులు అవార్డులు పొందిన వారిలో ఉన్నారు.