నేడు ఒలింపిక్ రన్
అనంతపురం కల్చరల్ : సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో శుక్రవారం ఒలింపిక్ రన్ నిర్వహిస్తున్నట్లు సాహితీ స్రవంతి జిల్లా ప్రధాన కార్యదర్శి రవిచంద్ర ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 గంటలకు టవర్‌క్లాక్ నుంచిlసప్తగిరి సర్కిల్ వరకు ఒలింపిక్ రన్ సాగుతుందన్నారు. డీఈఓ అంజయ్యతో పాటు పలువురు అధికారులు, ప్రముఖులు పాల్గొంటారన్నారు. భారత క్రీడాకారులకు మద్దతుగా కవులు తమ కవితలను వినిపిస్తారన్నారు. కవులు, కళాకారులు, రచయితలు, విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో పాల్గొనాలన్నారు.