sai temple
-
సాయి మందిరంలో చోరీ
సోంపేట: కొర్లాం గ్రామంలో 16వ జాతీయ రహదారికి సమీపంలో ఉన్న షిర్డీ సాయిబాబా మందిర ంలో ఆదివారం రాత్రి చోరీ జరిగినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. దేవాలయంలో బాబావారి వెండి పాదుకులు 500 గ్రాములు, వెండి కిరీటం 350 గ్రాములు, వెండి గ్లాసు 150 గ్రాములు కలిపి మొత్తం కిలో వెండి, నాలుగు నెలల హుండీలోని నగదు సుమారు రూ. 8 వేలు చోరీ జరిగినట్టు తెలిపారు. ఆలయ అర్చకుడు ఆదివారం రాత్రి 7 గంటల తర్వాత దేవాలయానికి తాళాలు వేసి వెళ్లి పోయారని, సోమవారం ఉదయం తిరిగి వచ్చేసరికి తాళాలు పగులు గొట్టి ఉన్నాయని పేర్కొన్నారు. ఆలయ ధర్మకర్త పెద్దింటి యర్రయ్య ఫిర్యాదు మేరకు బారువ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇచ్ఛాపురం సీఐ అవతారం, సోంపేట ఎస్ఐ భాస్కరరావు, శ్రీకాకుళం క్లూస్ టీం దేవాలయాన్ని పరిశీలించి, గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. అంతరాష్ట్ర దొంగల పని అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. -
సాయి దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
సోనియా జన్మదినం... ప్రత్యేక పూజలు, అర్చనలు
నిజామాబాద్: రాష్ట్ర విభజన ద్వారా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ బంగారు తెలంగాణ అప్పగించారని శాసన మండలిలో ఆ పార్టీ నేత డి. శ్రీనివాస్ తెలిపారు. బంగారు తెలంగాణను రత్నాల తెలంగాణగా మార్చాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు పరచాలని డీఎస్ డిమాండ్ చేశారు. డిసెంబర్ 9 సోనియాగాంధీ జన్మదినం. ఈ నేపథ్యంలో నగరంలోని మాధవనగర్ సాయిబాబా ఆలయంలో సోనియా పేరుతో డి.శ్రీనివాస్ ప్రత్యేక పూజలు, అర్చనలు చేయించారు. అనంతరం దేవాలయం వెలపల డీఎస్ విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు సోనియా జన్మదినమైన డిసెంబర్ 9, 2009న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విభజన విషయంలో ఎన్నో అడ్డంకులు, విమర్శులు ఎదురైనా... వాటికి ఎదురు నిలిచి సోనియాగాంధీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేశారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో సోనియాగాంధీ పుట్టిన రోజును తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనం జరుపుకుంటున్నారు. -
సాయి సన్నిధిలో వైఎస్ జగన్