ప్రియుడితో కలిసి భర్తను చంపింది..
ముజఫర్ నగర్ : ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హతమార్చిందో భార్య. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్లోని రూర్కలి గ్రామంలో చోటుచేసుకుంది. కలప వ్యాపారి సైదా హసన్ (45)ను ...భార్య సనవర్ బేగం ...ప్రియుడు షహనావాజ్తో కలిసి హతమార్చినట్లు పోలీసులు బుధవారమిక్కడ తెలిపారు.
కాగా కలప కొనేందుకు అటవీప్రాంతానికి వెళ్లిన సైదా హసన్ చివరకు శవమై తేలాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ...సనవర్ బేగంను తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయట పడింది. షహనావాజ్తో వివాహేతర సంబంధాన్ని వదులుకోవాలని భర్త హెచ్చరించటం వల్లే ఈ హత్య చేసినట్లు భార్య తెలిపింది. వారిద్దర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరు పరచనున్నారు.