ఎత్తిపోతల పథకం సర్వే పనుల్ని అడ్డుకున్న రైతులు
చింతలపూడి ఎత్తిపోతల పథకం సర్వే పనులను ప్రగడవరం రైతులు అడ్డుకున్నారు. దీంతో స్థానిక తహశీల్దార్ మైఖేల్ రాజ్, ఎస్ఐ సైదా నాయక్‌లు రైతులతో చర్చలు జరిపారు. పరిహారం చెల్లించాకే పనులు మొత్తం మొదలు పెట్టాలని రైతులు స్పష్టం చేయడంతో ఏంచేయాలో తోచక తికమక పడుతున్నారు.