అలరించిన డాగ్ షో
ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ :
హన్మకొండలోని సెయింట్ పీటర్స హైస్కూల్లో ఆదివారం నిర్వహించిన డాగ్‌షో అలరించింది. వివిధ రకాల శునకాలు పాల్గొ న్న ఈ ప్రదర్శనను నగర ప్రజలు ఆసక్తిగా తిలకించారు. కాకతీయ కెన్నల్ అసోషియేషన్ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ ప్రదర్శనలో వరంగల్‌తోపాటు పలునగరాలకు చెంది న శునకాలు పాల్గొన్నాయి. శునకాల యజమానులు వాటితో ప్రదర్శనలు ఇప్పించారు. అంతర్జాతీయ జడ్డీ మాథ్యు సి జాన్ ఈ ప్రదర్శనలో జడ్జీగా వ్యవహరించి వాటిని పరిశీలించారు. అత్యుత్తమ ప్రదర్శనతోపాటు, ఆరోగ్యకరంగా ఉన్న వాటిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కాకతీయ కెన్నల్ అసోషియేషన్ అధ్యక్షుడు కె.రామస్వామి, కార్యదర్శి వి.రమణారెడ్డి మాట్లాడుతూ కెన్నల్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా అనుబంధంగా తమ అసోషియేషన్ పనిచేస్తుందన్నారు. ఈ ప్రదర్శనలో 28 జాతులకు చెందిన 133 డాగ్స్ పాల్గొనగా, ఇందులో వరంగల్ నుంచి 50 శునకాలు పాల్గొన్నాయి.
ప్రదర్శనలో హైదరాబాద్ శ్రీనివాస్‌కు చెందిన డాగ్ రాట్వెల్లరీ ప్రథమ బహుమతి గెలుచుకుంది. హేమంత్(హైదరాబాద్)కు చెందిన జర్మన్ షెఫర్డ్ ద్వితీయ బహుమతి, ప్రవీణ్(హైదరాబాద్)కు చెందిన బిగేల్ తృతీయ బహుమతి పొందాయి. వరంగల్ ఆదిత్యకు చెందిన డాషౌండ్, అర్జున్‌కు చెందిన బ్రెడన్, కరణ్‌కు చెందిన బుల్మాసిఫ్, కృష్ణకు చెందిన ల్యాబెడ ర్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. వాటికి నిర్వాహకులు షీల్డ్‌లు బహుకరించారు. అసోసి యేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ ప్రవీణ్‌రెడ్డి, హరి నాథ్, దేవేందర్, అనంతకృష్ణ పాల్గొన్నారు.