saiprasad
-
శిరీష ఇంకెవరికీ దక్కకూడదనే..
-
శిరీష మరొకరికి దక్కకూడదనే...
సాక్షి, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి రిసార్ట్‌లో దారుణ హత్యకు గురైన డిగ్రీ విద్యార్థిని శిరీష కేసు వివరాలను శంషాబాద్ డీసీపీ పద్మజ మీడియాకు వివరించారు. తనకు దక్కని శిరీష ఇంకెవరికీ దక్కకూడదనే కోపంతోనే సాయిప్రసాద్ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపారు. చేవెళ్ల ఏసీపీ కార్యాలయంలో శుక్రవారం ఆమె ప్రెస్మీట్లో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‘శిరీష పదో తేదీ ఉదయం 11 గంటలకు కోచింగ్‌కు అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లింది. ఆమె దిల్‌సుఖ్‌నగర్‌లోని టైమ్స్ ఇనిస్టిట్యూట్‌లో కోచింగ్ తీసుకుంటోంది. సాయిప్రసాద్ ఆమెతో మాట్లాడాలి అని చెప్పి శంషాబాద్‌కు రావాలని ఫోన్ చేశాడు. అదే సమయంలో అతడు... ప్రగతి రిసార్ట్స్‌లో ఆన్లైన్లో కాటేజ్ బుక్ చేసి ఆమెను నేరుగా రిసార్ట్స్‌కు తీసుకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో నిన్న శిరీషను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసాడు. బాత్రూమ్కు వెళ్లిన ఆమెపై వెంట తెచ్చుకున్న కత్తితో గొంతుకోసి అతి కిరాతకంగా హత్య చేశాడు. నిందితుడు సాయిప్రసాద్ కొత్తూరులోని ఎన్‌టీడీఎఫ్ కళాశాలలో డిప్లొమా చేసి ఉద్యోగ ప్రయాత్నాలు చేస్తున్నాడు. గత అయిదేళ్లగా ప్రేమ పేరుతో శిరీష వెంట పడుతూ, పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడు. గత రాత్రే సాయిప్రసాద్‌ను చిలుకూరు బాలజీ టెంపుల్ వద్ద ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెళ్లికి నిరాకరించిందనే కోపంతోనే హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. శిరీష, సాయిప్రసాద్ శంషాబాద్‌లో ఇంటర్మీడియెట్ ఒకే కాలేజీలో చదివారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది.’ అని తెలిపారు. శిరీష మృతదేహానికి పోస్ట్‌మార్టం అనంతరం పూర్తి వివరాలు వెల్లడి అవుతాయని ఆమె తెలిపారు. శిరీష హత్య కేసు వివరాలను వెల్లడించిన డీసీపీ పద్మజ చదవండి.... రిసార్ట్‌లో దారుణం: అత్యాచారం చేసి.. ఆపై గొంతుకోసి -
నవయువ జక్కన
కాన్వాస్‌పై రంగులు అద్ది మనోహర దృశ్యాలను ఆవిష్కరించడమంటే అంత సులువు కాదు. ఇందులో అద్భుతాలు సాధిస్తూనే... చెక్క, మైనం తదితరాలతో ముచ్చటైన బొమ్మలు రూపొందించడం ఎంతమందికి సాధ్యం! రెండూ రెండు కళలు. ఒకటి కుంచెతో వర్ణాలద్దుకున్న భావ చిత్రం... మరొకటి మనసులోని ఆలోచనలకు ‘ప్రతి’రూపం. దేనికదే ప్రత్యేకం. రెండింటిలో రాణిస్తూ... తనలోని కళకు మెరుగులు అద్దుతున్నాడు సాయిప్రసాద్. కళాభిమానుల ప్రశంసలు అందుకొంటూ ముందుకు సాగుతున్న సాయితో ‘సిటీ ప్లస్’ ముచ్చట్లు... సనత్‌నగర్ బీకే గూడలో మా నివాసం. నాన్న కార్పెంటరీ వర్క్ షాప్ కూడా అక్కడే. ఇందులో పనిచేసేవారిని చూసి నాకు బొమ్మలు తయారు చేయాలనిపించింది. మొదటి సారిగా ఆరో తరగతి చదువుతున్నప్పుడు చాక్‌పీస్‌తో శివలింగం చేశా. ఆ తరువాత చాక్‌పీస్, చాక్ పౌడర్‌తో మరిన్ని వస్తువులు చేయడం అలవాటయింది. బాపు బొమ్మలా... బొమ్మలు తయారు చేయడం వేరు. గీయడం వేరు. కానీ నాకు రెండూ ఆసక్తే. అందుకే అప్పుడప్పుడు బొమ్మలు గీసేవాడిని. ‘బాగా వేస్తున్నావ్’ అని అనిపించుకున్నాక అదే కంటిన్యూ చేశా. కార్టూన్స్, మహనీయులు, ప్రకృతి, దేవుళ్లతో పాటు తంజావూరు బొమ్మలు వేయడం కూడా నేర్చుకున్నా. కానీ అన్నింటికన్నా నాకు బాపు బొమ్మలంటే ఇష్టం. ఆయన శైలిని అనుకరిస్తూ కూడా బొమ్మలు వేశాను. రకరకాలుగా... చాక్‌పీస్‌తో బొమ్మలు వేయడం మొదలుపెట్టిన తరువాత ఆ తరువాత పెన్సిలిడ్స్, వుడ్, క్యాండిల్‌తో అనేక రకాల బొమ్మలు చేశా. ఆపై ప్లాస్టిక్ పైపులకు వాడే ఎమ్సిల్, న్యూస్ పేపర్స్, ఎరైజర్స్, వాక్స్, మట్టితో బొమ్మలు తయారుచేశా. కొన్ని వస్తువులను ఇంటర్నెట్లో సెర్చ్ చేసి కొన్నా. ఇంకో విషమేమిటంటే వీటిని తయారు చేసేందుకు కావలసిన టూల్స్‌ని కూడా నేనే తయారు చేసుకున్నా. మై గ్యాలరీ ఎనిమిదేళ్లుగా నేను వేసిన బొమ్మలన్నీ భద్రపరిచా. మొత్తం 250 బొమ్మలు, 50 పేపర్ డ్రాయింగ్స్ ఉన్నాయి. చెక్కతో చేసిన పైరేట్స్ షిప్, షాట్ గన్ అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం చెక్కతో ఛత్రపతి శివాజి కత్తి చేస్తున్నా. అలాగే ఎరైజర్తో స్పైడర్‌మ్యాన్, మైఖేల్ జాక్సన్‌తో పాటు అష్ట వినాయకులు, లక్ష్మీదేవి, శివుడు, ఆంజనేయుడు తదితర దేవతామూర్తులు రూపొందిస్తున్నా. చాక్‌పీస్‌తో సెవన్ వండర్స్, వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్స్, జుమ్మా మసీదు, బుద్ధుడు, క్రికెట్ వరల్డ్ కప్స్ వంటివి రూపొందించా. ఎమ్సిల్ను ఉపయోగించి బాల కృష్ణుడు, మహా విష్ణువు, సింహం వంటి విగ్ర హాలు, పేపర్, వ్యాక్స్‌తో బొజ్జవినాయకుడిని రూపొం దించా. ఏటా వినాయకచవితికి నేనే వినాయకుడిని తయారుచేస్తా. ఇష్టపడే బీటెక్‌లో మెకానికల్ తీసుకున్నా. టూల్ డిజైనింగ్ నాకిష్టం. భవిష్యత్‌లో మంచి టూల్ డిజైనర్ కావాలన్నది లక్ష్యం. ఎస్.శ్రావణ్‌జయ ఫొటోలు: ఎన్.రాజేష్‌రెడ్డి -
దేవుడా..బతికించు!
కల్వకుర్తి, న్యూస్‌లైన్: ‘ఒక్కగానొక కొడుకు.. ఎవరికి ఏ పాపం చేసి ఎరుగం. దేవుడా బతికించు!’ అంటూ వైద్యవిద్యను అభ్యసించేందుకు వెళ్లి దుండగుల చేతిలో హత్యాయత్నానికి గురైన కల్వకుర్తి విద్యార్థి సాయిప్రసాద్ తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉందని తెలుసుకుని తీవ్ర మనోవేదన చెందుతున్నారు. పెట్రోల్‌పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయపడిన సాయిప్రసాద్‌ను స్థానికులు ప్రాథమిక చికిత్స కోసం మొదట స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. మెరుగైన వైద్యం కోసం సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగళూరులోని సెయింట్ జాన్స్ ఆస్పత్రికి తరలించారు. సాయిప్రసాద్ దేహం 70శాతం కాలిపోవడంతో ఊపిరితిత్తులతో పాటు కిడ్నీలు దెబ్బతిన్నాయి. దీంతో శ్వాస తీసుకునేందుకు అతను తీవ్రఇబ్బంది పడుతున్నట్లు అతని బంధువులు పేర్కొన్నారు. ప్రస్తుతం అతనికి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నారు. వైద్యానికి అంతరాయం కలుగుతుందనే ఉద్దేశంతో కుటుంబసభ్యులు, బంధువులను ఆస్పత్రి లోపలికి అనుమతించలేదు. ఇప్పటివరకు సాయిప్రసాద్ తల్లిదండ్రులు జ్యోతి, లక్ష్మణశర్మతో పాటు, మిత్రుడు సుభాష్‌ను మాత్రమే చూసేందుకు అనుమతించారు. కొడుకును ప్రత్యక్షంగా చూసేందుకు అతని తల్లిదండ్రులను సైతం అనుమతించకపోవడంతో ఆరోగ్య పరిస్థితి తెలియక తల్లడిల్లుతున్నారు. కల్వకుర్తి తదితర ప్రాంతాల నుంచి సాయిప్రసాద్‌ను చూసేందుకు వెళ్లినవారికి ఆస్పత్రి వర్గాల నుంచి అనుమతి లభించకపోవడంతో ఇంటిముఖం పట్టారు. తీవ్రంగా గాయపడిన సాయిప్రసాద్‌కు డయాలిసిస్ చేస్తున్నారు. అయితే శరీరంలోని అవయవాలు సహకరించకపోవడంతో అతని ఆరోగ్యం కుదుటపడటంలేదని వైద్యులు చెబుతున్నారని, అతని చూసేందుకు వెళ్లిన కొందరు ‘న్యూస్‌లైన్’తో పేర్కొన్నారు. మూడురోజులుగా ఆరోగ్యపరిస్థితిలో ఎలాంటి మార్పులేకపోవడంపై అతని కుటుంబసభ్యులు తీవ్రంగా కలత చెందుతున్నారు. అనంతపురంతో ప్రత్యేక అనుబంధం సాయిప్రసాద్‌కు అనంతపురం జిల్లాకు చెందిన వారితో ప్రత్యేక అనుబంధం ఉంది. అతని చిన్నాన్న వ్యవసాయశాఖలో అదే జిల్లాలో ఏడీగా పనిచేస్తున్నారు. అలాగే బెంగళూరులో తన మిత్రులు మెడిసిన్ చదువుతున్నారు. వేసవి తదితర సెలవులు వచ్చిన ప్రతిసారి సాయిప్రసాద్ తన మిత్రులతో కలిసి వారి ఇళ్లకు వెళ్లడం, వారిని హైదరాబాద్‌లోని తన ఇంటికి తీసుకురావడం చేసేవాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సాయిప్రసాద్‌కు అనంతపురం జిల్లాకు చెందిన వారే అన్ని తామై చూసుకుంటున్నారు. ఆ జిల్లాకు చెందిన విద్యార్థులు సైతం అతని చూసేందుకు ఆస్పత్రికి తరలొచ్చారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న మిత్రుడిని చూసి కన్నీరుమున్నీరవుతున్నారు.