చిక్కుల్లో మాజీ ప్రధాని
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషలిస్ట్ పార్టీ(బీఎన్పీ) అధ్యక్షురాలు ఖలిదా జియా(70) మరోసారి న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. ఆమెపై ఢాకా కోర్టులో పరువునష్టం దావా దాఖలైంది. ప్రధాని షేక్ హసినా కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ పై చేసిన ఆరోపణలు చేసినందుకు ఈ దావా వేశారు.
ఈ నెల 1న ఢాకాలో జరిగిన ర్యాలీలో జియా ప్రసంగిస్తూ... వాజెద్ అక్రమంగా 300 మిలియన్ డాలర్లు బ్యాంకుల్లో దాచుకున్నారని ఆరోపించారు. జియా చేసిన ఆరోపణలు వాజెద్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ ప్రొ-అవామి లీగ్ జననేత్రి పరిషత్ అధ్యక్షుడు ఏబీ సిద్ధిఖీ ఢాకా కోర్టులో పరువునష్టం దావా వేశారు. పిటిషన్ ను స్వీకరించిన కోర్టు విచారణ జరపాలని పోలీసులను ఆదేశించినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.