saji Thomas
-
విమానాన్ని తయారుచేశాడు కానీ ?
తిరువనంతపురం: అతనో పుట్టు మూగ చెవిటి. చదవింది 7వ తరగతి మాత్రమే. అయితేనేం..టాలెంట్ కేమీ కొదవ లేదు. అనుకున్నది సాధించాలన్న పట్టు వీడలేదు. అతని సాంకేతిక నైపుణ్యాన్ని గుర్తించిన డిస్కవరీ ఛానల్ ఒక డాక్యుమెంటరీ కూడా చేసింది. కానీ ఇపుడు భార్యాబిడ్డలను పోషించుకోవడానికి ఏదైనా ఓ చిరుద్యోగం దొరికితే బావుండు అని ఎదురు చూస్తున్నాడు.... వివరాల్లోకి వెళితే కేరళకు చెందిన సాజి థామస్ (45) మాట్లాడలేడు.. వినలేడు. అయితేనేమీ విభిన్నమైన ఆలోచనలు అతని మదిలో నిరంతరం మెదిలేవి. ఎపుడూ మోటార్లు, మెషీన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వాటి రిపేర్లు ఇదే అతడి లోకం. మొదట్లో అతని భార్య మరియాకు ఇదేమీ అర్థం కాలేదు. భర్త ఓ మంచి ఎలక్ట్రీషియన్ స్థిరపడితే బావుండు కదా..ఎందుకు ఈ పనికిరాని పనులు అనుకునేది. కానీ భర్తకున్న ఆసక్తిని గమనించి అతని అన్ని విధాలుగా అండగా నిలిచింది. అలా 14 ఏళ్లు అతనికి తోడ్పాటు అందించింది. ముందు ఒక హెలికాప్టర్ నమూనా తయారుచేశాడు. ఆ తరువాత ఇద్దరు ప్రయాణించడానికి వీలుగా అతి తేలికైన విమానాన్ని రూపొందించాడు. వీటిపైనే డిస్కవరీ ఛానల్ ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందించింది. ఆ తరువాత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో కూడా సాజికి పరిచయం ఉంది. సాజిలో ఉన్న ఉత్సుకతను గమనించిన రాజీవ్ తప్పకుండా సాయం చేస్తానని హామీ కూడా ఇచ్చారు. కానీ 1991 లో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. అయినా సాజి నిరుత్సాహపడలేదు. పట్టుదల మరింత పెరిగింది. విమానాన్ని తయారు చేయాలన్న తన ప్రయత్నాన్ని కొనసాగించాడు. సుమారు అయిదేళ్ల కఠోర దీక్ష, శ్రమ తరువాత ఒక చిన్న విమానానికి (రెండు చక్రాల ఇంజిన్ కలిగిన) రూపకల్పన చేశాడు. మధురైకి సమీపంలోని అంబా సముద్రం ఎయిర్ లైన్ అకాడమీ అతని విమానాన్ని పరిశీలించింది. చీఫ్ ఇన్స్ట్రక్టర్ , మాజీ విమానదళ అధికారి కొన్ని నిమిషాలపాటు దీన్ని గాల్లో చక్కర్లు కొట్టించారు. కానీ అతనికిగానీ, అతను కనిపెట్టిన విమానానికి గానీ లైసెన్స్ లభించలేదు. నిబంధనలు అనుమతించడంలేదని అధికారులు సమాధానమిచ్చారు. సాజి దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయాడు. కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థంకాక అయోమయంలో ఉన్నాడు. కాగా ఈ విమానాన్ని తయారుచేయడానికి 13 లక్షల రూపాయల వెచ్చించాడు. ఈ క్రమంలో తన హాబీ కోసం మొత్తం ఉన్న ఆస్తి అంతా ఖర్చుపెట్టాడు. దాదాపు 25 లక్షలు హారతికర్పూరంలా కరిగిపోయాయి. దీంతో సాజి కుటుంబంలో కష్టాల్లో పడింది. అధికారులు ఇప్పటికైనా తన భర్తకు సరైన ప్రోత్సాహాన్నివ్వాలని సాజి భార్య మరియా కోరుతోంది. అతని ప్రతిభను గుర్తించి ఆదుకోవాలని విజ్క్షప్తి చేస్తోంది. ప్రభుత్వం తన భర్తకు ఉద్యోగాన్ని కల్పించి తమ కుటుంబానికి వేడుకుంటోంది. తద్వారా తమ బిడ్డ జోషు(13) కొడుకును మంచి సాంకేతిక నిపుణుడుగా చేయాలని తమ కోరికను నెరవేర్చాంటూ కన్నీళ్లతో అభ్యర్థిస్తోంది. తన భర్తపై రూపొందించిన ఈ డాక్యుమెంటరీ త్వరలో ప్రసారం కానుందని తెలిపింది. అటు ఇదిక్కి జల్లాలో గ్రామ ప్రజలు కూడా సాజికి మద్దతు తెలిపారు. ప్రభుత్వం అతనిని ఆదుకోవాలని కోరుతున్నారు. -
హైదరాబాదీ సాజి థామస్‌కు అర్జున అవార్డు
న్యూఢిల్లీ: హైదరాబాద్ రోయింగ్ క్రీడాకారుడు సాజి థామస్, భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్.. అర్జున అవార్డుకు నామినేట్ అయ్యారు. భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ సారథ్యంలోని అవార్డుల కమిటీ.. అర్జున అవార్డుకు ఆటగాళ్ల పేర్లను నామినేట్ చేసింది. అర్జున అవార్డుకు థామస్, అశ్విన్‌తో పాటు షూటర్ హీనా సిద్ధు, అభిషేక్ వర్మ (ఆర్చరీ), టింటూ లూకా (అథ్లెటిక్స్), గిరీశ (పారాలంపిక్స్), దిజు (బ్యాడ్మింటన్), గీతూ ఆన్ జోసె (బాస్కెట్ బాల్), జై భగవాన్ (బాక్సింగ్), అనిర్బన్ (గోల్ఫ్), మమతా పూజారి (కబడ్డీ), అనక అలంకమని (స్వ్కాష్), టామ్ జోసెఫ్ (వాలీబాల్), రేణుబాల చాను (వెయిట్ లిఫ్టింగ్), సునీల్ రానా (రెజ్లింగ్) పేర్లను నామినేట్ చేశారు. కాగా ఖేల్‌రత్న అవార్డుకు ఎవరి పేరును సిఫారసు చేయలేదు.